పుట్టగొడుగుల సాగు.. లాభాలు బాగు
సేంద్రియ పద్ధతితో మష్‌రూమ్ పెంపకం
మారుమూల బూసిపుట్టు యువతప్రత్యేకత
గ్రీన్‌హౌస్‌లో ఏడాది పొడువునా పంట
ప్రయోజనాలు
పుట్టగొడుగులో కొవ్వు రహితమైన కేలరీలు ఉంటాయి. రాగి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, బి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో కూడా నిండి ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఇవి తగ్గిస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండి పెరుగుదలకు కావాల్సిన లైసిక్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటంతో అధిక జీర్ణశక్తిని కలిగి ఉంటాయి.
ముంచంగిపుట్టు:
పుట్టగొడుగులు మంచి రుచికరమైన ఆహారమే కాదు.. లాభాలు అందించే సాధనం కూడా. చిన్న గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే మంచి ఫలితాలను అందిస్తుంది. 2015లో కేవలం మూడు వేల రూపాయలతో పుట్టగొడుగుల సాగు ప్రారంభించిన ఇద్దరు స్నేహితులు సాధురాం, హరిబాబు స్వయంకృషితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రూ.లక్షా 50 వేల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి, ఎంతో సులభంగా తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను పెంచుతూ ముందుకు సాగుతున్నారు.
గత 9 సంవత్సరాలుగా పుట్టగొడుగుల సాగును ఇంటి వద్దనే చేస్తున్న సాధురాం, హరిబాబులు లాభాలు ఆర్జిస్తున్నారు. బూసిపుట్టు గ్రామం నుంచి ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో జరిగే 8 వారపు సంతలకు తీసుకువెళ్లి పుట్టగొడుగులను అమ్ముతున్నారు. దీంతోపాటు కిరాణా షాపులకు ఏడాది పొడవునా సరఫరా చేస్తున్నారు. వీరు సాగు చేసే పుట్టగొడుగులు మంచి రుచిగా ఉండడంతో డిమాండ్ నెలకొంది. దీంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతుంది. కేవలం 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 1500 వరకు లాభం వస్తుందని, రూ.3 వేలతో తమ సాగు మొదలై నేడు లక్షా 50 వేల వరకు లాభాలు వస్తున్నాయని, రానున్న రోజుల్లో సాగు విస్తరణ మరింత పెంచి, గిరిజన ప్రాంతం అంతా పుట్టగొడుగులు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఐటీడీఏ ద్వారా ఆర్థికంగా రాయితీలు కల్పిస్తే గిరిజన యువతకు సాగుపై అవగాహన కల్పించి, మరింతమంది యువత పుట్టగొడుగుల సాగును చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఇంటిలో ఏర్పాటు చేసిన
గడ్డి బ్యాగ్‌లతో సాధురాం
ఇలా పెంచాలి..
లాభాలు
పుట్టగొడుగుల సాగు.. లాభాలు బాగు
Comments
Please login to add a commentAdd a comment