షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం
వి.ఆర్.పురం: రామవరంపాడు గ్రామంలో గురువారం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. మిర్చి కోతలకు వెళ్లిన సమయంలో సోలా నరసింహారావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను అదుపు చేసే వారు లేకపోయారు. ఆ ఇంట్లో నరసింహారావు కుటుంబంతోపాటు ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు 15 మంది ఉంటున్నారు. వారికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. వారి సామాన్లు, బట్టలు, రేషన్, కష్టపడి సంపాదించిన రూ.లక్షా 30 వేల సొమ్ము మొత్తం కాలిపోవడంతో బోరున విలపించారు. అగ్ని బాధితులకు తక్షణ సహాయం కింద వీఆర్వో ఎం.హైమవతి, ఆర్‌ఐ మడకం రామకృష్ణ పంచనామా నిర్వహించి 25 కేజీల బియ్యం అందజేశారు.
రూ.5 లక్షల ఆస్తి నష్టం
Comments
Please login to add a commentAdd a comment