బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత విశాఖ ఉక్కు
ఉక్కునగరం: జాతీయ స్థాయి ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్ జట్టు కై వసం చేసుకుంది. స్టీల్‌ప్లాంట్స్ స్పోర్ట్స్ బోర్డు (ఎస్‌పీఎస్‌బీ) ఆధ్వర్యంలో దుర్గాపూర్‌లో మార్చి 3 నుంచి 5 వరకు ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటర్ చాంపియన్‌షిప్ 2024–25 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్, దుర్గాపూర్, బిలాయ్, భద్రావతి, బొకారో, సేలం, రూర్కెలా, ఐఎస్‌పీ బర్న్‌పూర్ తదితర 9 జట్లు పాల్గొన్నాయి. బుధవారం దుర్గాపూర్‌తో జరిగిన ఫైనల్స్ పోటీల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ జట్టు చాంపియన్‌షిప్ గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో దుర్గాపూర్ స్టీల్‌ప్లాంట్ ఈడీ పి.మురుగేషన్ విశాఖ స్టీల్‌ప్లాంట్ జట్టుకు బంగారు పతకం, ట్రోపీ అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ ఇన్‌చార్జ్ సీఎండీ ఎ.కె.సక్సేనా విజేతలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment