పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి
● గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి
సురేంద్ర
పెదబయలు: గిరిజన రైతులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం కిలో పసుపు ధర రూ.130 ఉందని, పిప్పళ్ల ధర రూ.340 ఉందని చెప్పారు. పసుపు రూ.300 , పిప్పళ్లు రూ.500 గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, పోరా త్రినాఽఽథ్, రాందాసు, బొండా గంగాధరం, బుజ్జిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment