No Headline
డుంబ్రిగుడ: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా...మానవత్వమే మార్గంగా నేరనిరోధక అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కమ్మిడి కృష్ణకుమారి ముందుకుసాగుతున్నారు. కరోనా సమయంలో ఆమె గిరిజనులకు విశేష సేవలందించారు. మాస్క్‌లు పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర సరకులు అందజేసి పలువురిని ఆదుకున్నారు. పేద గిరిజనులకు దుస్తులు, రగ్గులు ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నారు. 2015 నుంచి సేవలందించడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 20 వేల మంది గిరిజనులకు ఏదో ఒక రూపంలో సేవ చేసినట్టు ఆమె తెలిపారు. చేసిన సేవలకు గాను పలు అవార్డులు ఆమెను వరించాయి.
ఢిల్లీలో జాతీయ సేవారత్న అవార్డును అందుకుంటున్న కృష్ణ కుమారి (ఫైల్)
No Headline
Comments
Please login to add a commentAdd a comment