270 మందికి వైద్య పరీక్షలు
గూడెంకొత్తవీధి(సీలేరు): మండలంలోని దారకొండలో పోలీసు, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దారకొండ పరిసర ప్రాంతాల నుంచి 270 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వీరందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా 32 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారన్నారు. ఈనెల 10న వారికి ఆపరేషన్‌లు చేస్తారన్నారు. వైద్యాధికారి మస్తాన్‌వలి, సీలేరు ఎస్‌ఐ రవీంద్ర, శంకర్ ఫౌండేషన్ ఆప్తాలమిస్ట్ రమేష్‌బాబు ఎంఎల్‌హెచ్‌పీలు నాగమణి, లోవకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment