సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment