ఆశ్రమ పాఠశాలలకు బియ్యం పంపిణీ
పెదబయలు: పెదబయలు మండలంలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు శుక్రవారం జీసీసీ అధికారులు ఎట్టకేలకు బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని ఆశ్రమ పాఠశాలలతో పాటు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చాలా తక్కువగా బియ్యం సరఫరాపై ‘సాక్షి’లో ’వెతలు తీరేనా’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు హూటాహూటిన శుక్రవారం ఉదయం నుంచి పెదబయలు మండలంలోని పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1, 2, ఆశ్రమ గిరిజన సంక్షేమ బాలూరు1, 2 పాఠశాలకు 50 బస్తాల చొప్పున బియ్యాన్ని లారీల్లో సరఫరా చేశారు. మిగిలిన సీకరి, అరడకోట, కొరవంగి, రూడకోట, పాఠశాలకు మాత్రమే పంపిణీ చేశారు. అయితే పంపిణీ చేసిన పాఠశాలలకు ఇండెంట్ ప్రకారం కాకుండా అరకొరగా బియ్యం సరఫరా చేశారు. పూర్తి స్థాయిలో బియ్యం అందించాలని వార్డెన్లు, నిర్వాహకులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో అందించకపోతే పది రోజుల తరువాత మరలా బియ్యం కొరత ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.
అరకొరగా పంపిణీ చేసిన జీసీసీ అధికారులు
ఆశ్రమ పాఠశాలలకు బియ్యం పంపిణీ
ఆశ్రమ పాఠశాలలకు బియ్యం పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment