అన్ని రంగాల్లో ఆమె..
డాక్టర్, టీచర్, ఆఫీసర్, పోలీస్.. ఇలా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఆర్మీలో కూడా చేరి దేశం కోసం పోరాడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం వారికి కాస్తంత అవకాశం కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు వక్తలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.
సాక్షి, పాడేరు: తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చదువుతో పాటు అన్ని రంగాల్లోను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం స్థానిక వి.ఆర్.ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ప్రోత్సహించాలన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుజేస్తున్నాయని, మహిళలు చైతన్యవంతులు కావాలన్నా రు. ఆడపిల్లలకు బాల్యదశలోనే వివాహాలు చేసే చెడు సంప్రదాయాన్ని తల్లిదండ్రులు వీడాలన్నారు. పనిచేసే చోట మహిళలు ఇబ్బందులకు గురైతే మహిళా హెల్ప్‌లైన్ 181 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. సఖి, వన్‌స్టాప్ కేంద్రాలు కూడా బాలికలు, మహిళలకు రక్షణగా పనిచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బాల్య వివాహాలు పూర్తిగా మాయం కావాలి
జిల్లాలోని అన్ని ప్రాంతాలలోను బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర కోరారు. బాలికలు, మహిళలను ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దన్నారు. అన్ని రంగాలలోను మహిళలు, పురుషులకు దీటుగా పనిచేస్తున్నారని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలను మహిళలు అధిగమించాలని, వారితో ఇబ్బందులు ఉంటే పోలీ సుశాఖను సంప్రదించాలని అన్నారు. అసాంఘిక కార్యకలపాలను ఎదిరించాలన్నారు.
మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం
వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఘ నంగా సన్మానించారు. దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛా లు అందజేశారు. సత్కారాలు పొందిన వారిలో డీఆర్వో పద్మలత, పాడేరు ఐటీడీఏ ఏవో హేమలత, ఇన్‌చార్జి డీడీ రజని తదితర 90మంది ఉన్నారు. 790 మంది మహిళలకు సీ్త్రనిధి రుణాలు రూ.5 లక్షల 5 వేలు, 1644 సంఘాలలోని 18,084మంది రూ.57 కోట్ల 89 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు, 8 సంఘాల్లోని 13మంది సభ్యులకు రూ.39 లక్షల ఉన్నతి రుణాలు, ఐదుగురు మహిళలకు నారీ శక్తి కింద రూ.8 లక్షలు, పీఎంజీపీ కింద ఇద్దరు మహిళలకు రూ.5 లక్షల రుణాల చెక్‌లను కలెక్టర్ దినేష్‌కుమార్ ఇతర అధికారులు పంపిణీ చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ, ఏఎస్పీ ధీరజ్, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ నూతినాయుడు పాల్గొన్నారు.
పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీ
పాడేరు: సృష్టికి మూలమైన మహిళలను ప్రతి ఒ క్కరు గౌరవించాలని, అమ్మాయిలను తల్లిదండ్రు లు బాగా చదివించాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నా రు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్ట ణంలో మహిళ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ప్రదర్శన జరిపారు. లింగ వివక్ష వద్దు, ఆడపిల్లలను అవమానించవద్దు, ఆడ పిల్లల చదువు ఇంటికి వెలుగు అని నినాదాలు చేశారు. డీఎస్పీ ఎస్‌కే షెహబజ్ అహ్మద్, పాడేరు సీఐ దీనబంధు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, దిశ ఎస్‌ఐ శకుంతల, పట్టణంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.
అవకాశాలు
కల్పిస్తే
అతివలదే విజయం
సమాజం,
తల్లిదండ్రులు ప్రోత్సాహంఇవ్వాలి
కలెక్టర్
దినేష్ కుమార్
పిలుపు
అన్ని రంగాల్లో ఆమె..
అన్ని రంగాల్లో ఆమె..
అన్ని రంగాల్లో ఆమె..
Comments
Please login to add a commentAdd a comment