
భద్రత వైఫల్యాలే శిశువు అపహరణకు కారణం
రంపచోడవరం: ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా ఏరియా ఆస్పత్రి నుంచి శిశువును ఒక మహిళ అపహరించుపోయిన సంఘటన దారుణమని రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర అన్నారు. ఆస్పత్రిలో సరైన భద్రత చర్యలు లేకపోవడం ఇలాంటి సంఘనలకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ జరగని అనేక సంఘటనలు చోటుచేసుకుంటాన్నాయన్నారు.రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను, సంఘటనలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు.