
మోదమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
● 150 రోజుల్లో రూ.4.60 లక్షలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు భక్తుల సమక్షంలో హుండీని తెరిచి నగదు లెక్కించారు.150 రోజులకుగాను రూ.4,60,470 ఆదాయం లభించింది. అలాగే బంగారం,వెండి,రాగి వస్తువులను కూడా మోదమ్మకు భక్తులు కానుకలుగా సమర్పించారు.