
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
నియోజకవర్గ ప్రజలకుశ్రీరామనవమి శుభాకాంక్షలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
డుంబ్రిగుడ: నియోజకవర్గ ప్రజలకు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముందస్తుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండగ పూజలు జరుపుకోవాలని కోరారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అటువంటి శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
వన్‌ధన్ వికాస కేంద్రాలఅభివృద్ధికి కృషి
రంపచోడవరం: ఏజెన్సీలో వన్‌ధన్ వికాస కేంద్రాలకు సరఫరా చేసే జీడిపిక్కలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సందేహాలు ఉంటే ఐటీడీఏలో సంప్రదించాలని పీవో కట్టా సింహాచలం తెలిపారు. వీడీవీకేలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వన్‌ధన్ వికాస కేంద్రాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 08864–2421135, 944801435కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
● ఆశ్రమ పాఠశాల, కేజీబీవీని
సందర్శించిన జేసీ అభిషేక్ గౌడ,
సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్
డుంబ్రిగుడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పరిశీలించారు. డుంబ్రిగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానాన్ని శనివారం సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అనంతరం అరకులోయ మండల కేంద్రంలో ఏడో తేదిన నిర్వహించనున్న మహా యోగాసనాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు.