
సారా నిర్మూలన అందరి బాధ్యత
రంపచోడవరం: సారా నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న నవోదయం పోస్టర్లను ఐటీడీఏ సమావేశం హాలులో సోమ వారం పీవో, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మట్లాడుతూ సారా వల్ల కలిగే నష్టాలను గ్రామాల్లో గిరిజనులకు వివరించి, చైతన్య పరచాలని సూచించారు. సారా విక్రయించినా, తయారు చేసినా, రవాణా చేసినా శిక్ష తప్పదన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడు తూ సారా వల్ల కలిగే అనర్థాలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.నాగరాజు, ఎస్‌డీసీ అంబేడ్కర్, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్ , తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో ఎస్.శ్రీనివాసదొర, ఏడీఎంహెచ్‌వో జి.శిరీష, డీడీ రుక్మాండయ్య, డీఎల్‌పీవో కోటేశ్వరరావు,సీడీపీవో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.