
క్రీడాకారులకు కలెక్టర్, ఐటీడీఏ పీవో అభినందన
పాడేరు రూరల్: ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో విజయం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న 16 మంది క్రీడాకారులను శుక్రవారం కలెక్టర్, దినేష్‌కుమార్, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో అభిషేక్ గౌడ అభినందించారు. రాష్ట్ర స్థాయి మాదిరిగానే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కూడా విజేతలుగా నిలిచి, పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు నూకరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ రాష్ట్రం కోటలో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు జిల్లా నుంచి 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.