
వైఎస్సార్ సీపీ పీఏసీసభ్యులుగా ఇద్దరికి చోటు
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)ని పునర్వ్యవస్థీకరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంపీ గొల్ల బాబూరావుతో పాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడులకు సభ్యులు గా స్థానం లభించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ప్రకటించింది. అలాగే పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉండనున్నారు. రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

వైఎస్సార్ సీపీ పీఏసీసభ్యులుగా ఇద్దరికి చోటు