తాటిపూడి వద్ద ‘భూమాత’ సరికొత్త వెంచర్
కొమ్మాది: భూమాత గ్రూప్, ఎస్‌విఎన్ గ్రూప్ సంయుక్తంగా తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాతాస్ ఎస్‌వీఎన్ స్వప్నలోక్ పేరుతో వెంచర్ వేస్తున్నట్లు భూమాత గ్రూప్ ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. బీచ్‌రోడ్డులోని ఓ రిసార్ట్‌లో ఆదివారం సాయంత్రం దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఎస్‌విఎన్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఎకరాల్లో 5 ఫేజ్‌ల్లో.. 1650 ఫ్లాట్లు వీఎంఆర్‌డీఏ అనుమతులతో అందరికి అందుబాటు ధరల్లో నిర్మించినట్లు తెలిపారు. ఈ వెంచర్‌లో ఇంతవరకు రియల్‌ఎస్టేట్ చరిత్రలో ఎవరు ఇవ్వని సౌకర్యాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్టుగా కస్టమర్లకు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఆంధ్రలో ఇదే మొదటిదని తెలిపారు. ఈ వెంచర్‌కు సమీపంలోని తాటిపూడి రిజర్వాయర్‌ను ప్రభుత్వం టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తుండడంతోపాటు 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ టూరిస్ట్ స్పాట్‌గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లూరి శివాజి, కిరణ్ శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment