వంద కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం: ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు చేశామని, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన గంజాయి, నిందితులను మీడియా ముందుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ట్రైనీ డీఎస్పీ చైతన్య, ఎస్‌ఐ రమేష్, ఏఎస్‌ఐ సాంబశివ మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి బాలుర గురుకుల పాఠశాల మెయిన్ రోడ్డులో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. కె.డి.పేట నుంచి నర్సీపట్నం మీదగా తాళ్లపాలెం ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్, నర్సీపట్నానికి చెందిన వ్యక్తి పరారయ్యారు. చింతపల్లి మండలం, కొరుకొండ గ్రామానికి చెందిన ఎం.గాంధీ, వంతు ల హరిబాబు, నర్సీపట్నానికి చెందిన రౌడీషీటర్ భార్గవను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. ఆటోతో పాటు వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ గోవిందరావు పాల్గొన్నారు.
ముగ్గురు వ్యక్తుల అరెస్టు
ఇద్దరు పరార్
Comments
Please login to add a commentAdd a comment