ప్రశ్నించే గొంతులపై దాడులను ఖండించాలి
నర్సీపట్నం : సామాజిక కార్యకర్త కె.శివనారాయణరాజుపై జరిగిన దాడిపై ఎంపీ సీఎం రమేష్ స్పందించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ కోన గురవయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు చాలా సిగ్గుచేటన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొట్టా నాగరాజు మాట్లాడుతూ ప్రశాంతమైన నర్సీపట్నంలో ఇలాంటి దాడులకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఖండించకపోతే ఇదే సంస్కృతి కొనసాగుతుందన్నారు. బాధితుడు శివనారాయణరాజుకు అండగా ఉంటామన్నారు. బీజేపీ నాయకుడు వెలగ జగనాథం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులు దురదృష్టకరమన్నారు. టాక్స్ ఫెయిర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.త్రిమూర్తులరెడ్డి మాట్లాడుతూ దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment