
సెక్యూరిటీ గార్డ్ కుమార్తెకు అత్యధిక మార్కులు
● ఇంటర్ ఫలితాల్లో కై ట్స్ విద్యార్థిని ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కై ట్స్ కళాశాల విధ్యార్ధిని పాలెపు సుప్రియ (1000/988)మార్క్స్‌తో అనకాపల్లి జిల్లాకి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థిని తండ్రి ఒక అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా, తల్లి దినసరి కూలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నా తన పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు పడే తపన సుప్రియ తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనే పట్టుదలతో సుప్రియ బాగా చదివి ఇంటర్‌లో అనకాపల్లి జిల్లాకే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ సుప్రియకి ఫ్రీ అడ్మిషన్‌తో పాటు ప్రతి ఏటా రూ.10వేల ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి వారైనా అనుకున్నది సాదించవచ్చునని చిరంజీవి అన్నారు. తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.