
పోలీసులు వేధిస్తున్నారు!
తాడిపత్రిటౌన్: ‘పంచాయితీ’ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బంగారు వ్యాపారి గౌసుల్లా శుక్రవారం స్టేషన్ ఎదుటే సైనేడ్ తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అయితే పోలీసులు తనను వేధిస్తున్న తీరు, తన కటుంబ పరిస్థి తి గురించి గౌసుల్లా కన్నీరుపెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ బతుకుతున్నానని, పుట్టిన పిల్లల్లోనే సంతోషం చూసుకుంటూ వారి కోసం బతుకుతున్నాని, అయితే పోలీసుల తీరు కలచివేస్తోందని చెప్పుకొచ్చాడు. ‘సార్ (పోలీసులను ఉదేశించి) మీరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. వాడు మంచివాడా చెడ్డావాడా.. వాడు ఎలా బతుకుతున్నాడు తెలుసుకొని విచారించాలి. డబ్బులు తీసుకురా.. అది దొంగ బంగారు అంటే ఎలా సార్. తెలిసినవ్యక్తి బ్యాంకులో వేలంలో బంగారు పోతుంది అంటే.. వారికి సాయం చేసినట్లు ఉంటుందని ఆరోజు డబ్బులు ఇచ్చి కొన్నాను. అదే నా తప్పు అయ్యింది. అది దొంగ బంగారు అని ఎలా తెలుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
తప్పక న్యాయం చేస్తాం
పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న గౌసుల్లా కుటుంబానికి తప్పక న్యాయం చేస్తామని సీఐ సాయిప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని పెద్దబజార్‌లో ఉన్న గౌసుల్లా ఇంటి వద్దకు సీఐ వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వీఆర్‌కు హెడ్‌కానిస్టేబుల్
బంగారు వ్యాపారిని పంచాయితీ పేరుతో వేధించిన తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ రెహమాన్‌ను ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్‌కు పంపారు.
విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోండి
ఆత్మహత్యకు ముందు బంగారు వ్యాపారి సెల్ఫీ వీడియో
సోషల్ మీడియాలో వైరల్