
సాక్షి, అమరావతి: మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్‌కు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు.
ఈ ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే.. వాట్సాప్ మెసేజ్‌లు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చాయో.. వాటికి కారకులెవరో? గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం డీజీపీని కోరారు.