
సాక్షి, అమరావతి :స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మద్యం, డ్రగ్స్, ఇసుక అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టేందుకు నెలకొల్పిన ఎస్‌ఈబీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తలపెట్టింది. ఎక్సైజ్ శాఖలో ఉన్న 31 మంది అధికారులను కొత్తగా ఎస్‌ఈబీకి కేటాయించింది. ఈ మేరకు ఎస్‌ఈబీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న డీజీపీ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్‌ఈబీకి కేటాయించిన వారిలో ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు డెప్యూటీ కమిషనర్లు, 9 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 16 మంది సూపరింటెండెంట్లు ఉన్నారు.