
బూటు కాళ్లతోనే అచ్చెన్నాయుడు..
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఎవరి మనోభావాలు పట్టవు. ఒక్క ‘రాజగురువు’ వద్ద తప్ప.. మరెక్కడా పాదరక్షలు విడవరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు. సోమవారం తిరుపతి కపిలతీర్థం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన తీరే ఇందుకు నిదర్శనం.
ఈ వేడుకల్లో శ్రీవారి లడ్డూను, వడలను కింద పెట్టి.. వాటి చుట్టూ అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు బూటు కాళ్లతో తిరగడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచినట్లుగా టీడీపీ నేతలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలైన పెద్ద లడ్డు, వడలు భక్తులకు అత్యంత పవిత్రమైనవి. అలాంటి ప్రసాదాన్ని అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు అవమానపర్చిన ఘటన భక్తులను కలచివేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment