సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శి పంకజ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలు వివరిస్తూ టీడీపీ హయాంలో జరిగిన పొరపాట్లను వివరించారు. ఇక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఖర్చును కేంద్రం రీయింబర్స్ చేయాలని, దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు. తర్వాత పౌర విమానయాన శాఖ అధికారులను కలిసిన బుగ్గన ఓర్వకల్లు విమానాశ్రయంలో కమర్షియల్ రాకపోకలు మొదలు పెట్టే అంశం గురించి చర్చించారు. నిన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ను కలిసి అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ గురించి చర్చించారు.
విద్యుత్ ఆదా చేసే ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి సహాయం కోరారు. అదే విధంగా స్టేట్ డెవలప్‌మెంట్స్ రుణాలపై వడ్డీని తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రాయోజిక పథకాలకు బడ్జెట్‌లో నిధులివ్వాలని అడిగారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్ర బడ్జెట్‌లో స్థానం కల్పించాలన్నారు. ఏపీ పునర్విభజన వల్ల నష్టం జరిగింది కనుక రాష్ట్రానికి సాయం చేయాలని బుగ్గన కేంద్రాన్ని కోరారు. (చదవండి: ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ)
Comments
Please login to add a commentAdd a comment