నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాతో భేటీ అయిన మంత్రి బుగ్గన
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంత కరువు నివారణకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, గాలేరు–నగరి సుజల స్రవంతి కడప ఎస్‌ఈ ఎం.మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–1 నంద్యాల ఎస్‌ఈ షేక్ కబీర్ బాషాలతో కలిసి అవినాశ్ మిశ్రాతో రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు.
రాయలసీమలో కరువు నివారణకు 19 నీటి పారుదల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజనలో చేర్చాలని కోరారు. 15 లక్షల ఎకరాల స్థిరీకరణకు రూ.29 వేల కోట్ల ఆర్థిక సాయంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన అవినాశ్ మిశ్రా డీపీఆర్‌ల తయారీకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. డీపీఆర్‌లను నెలరోజుల్లోగా కేంద్ర జల సంఘానికి అందించాలని సూచించారు. సమావేశం సానుకూలంగా జరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment