ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యోగుల బదిలీల అంశంలో ప్రభుత్వం స్పల్ప మార్పులు చేసింది. బదిలీలకు సంబంధించి పలు నిబంధనలను పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా.. ఉద్యోగులు బదిలీ కోరుకునే మూడు ప్రాంతాలను మాత్రమే పేర్కొనేందుకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు వాటిని 20 ప్రాంతాలకు పెంచారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ నాటికి పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించగా.. ఆ తేదీని ఫిబ్రవరి 7 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకునే వారిని కూడా చేర్చారు. ఉద్యోగులు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి బదిలీ దరఖాస్తులు సమర్పించాలని గత ఉత్తర్వుల్లో పేర్కొనగా.. దాన్ని ఫిబ్రవరి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిశీలన తేదీని ఫిబ్రవరి 18 వరకు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment