CM Jagan In Distribution Of Equipment Under YSR Yantra Seva Scheme, Details Inside - Sakshi
Sakshi News home page

ఇదిగో గ్రామ స్వరాజ్యం

Published Sat, Jun 3 2023 4:13 AM | Last Updated on Sat, Jun 3 2023 1:44 PM

CM Jagan in distribution of equipment under YSR Yantra Seva Scheme detail - Sakshi

రైతులు దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక. అలాంటి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందు­కోసమే రాష్ట్రంలో నాలుగేళ్లుగా వారికి అన్ని విధాలా అండగా నిలిచాం. విత్తనం మొదలు పంట కొను­గోలు వరకు అన్ని దశల్లో వారికి దిశా నిర్దేశం చేస్తూ తీసుకొచ్చిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలి­స్తున్నాయి. ఈ పరంపరలో భాగంగా రైతులకు అతి తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు సమకూరుస్తూ ఇంకో అడుగు ముందుకు వేశాం. అన్నదాతలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించడంలో భాగంగా రైతన్నలే ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లన్నింటినీ అతి తక్కువ అద్దెతో మిగిలిన రైతులకు అందుబాటు­లోకి తేవడం గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో రాష్ట్ర స్థాయి రెండో మెగా పంపిణీ కింద రూ.361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ట్రాక్టర్‌ను, కంబైన్డ్‌ హర్వెస్టర్‌ స్వయంగా నడిపారు. 

అనంతరం రూ.125.48 కోట్ల సబ్సిడీ సొమ్మను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులే ఒక గ్రూపుగా ఏర్పడి దానిని ఒక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కిందకు తీసుకుని వచ్చి, ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులందరికీ తక్కువ ధరకు ఈ యంత్రాలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి తమ ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నారు. తద్వారా 10,444 ఆర్బీకేల పరిధిలో రైతులకు ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లు తక్కువ అద్దెతో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఏ యంత్రాలు కావాలో రైతులదే నిర్ణయం

  • ఇంతకు ముందు 6,525 ఆర్బీకేల స్థాయిలో, 391 క్లస్టర్‌ స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను రైతుల పేరుతో ప్రారంభించాం. వాటి పరిధిలో 3,800 ట్రాక్టర్లు, 391 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 22,580 ఇతర యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశాం. ఇప్పుడు మరో 3,919 ఆర్బీకేల స్థాయిలో, మిగిలిన 100 క్లస్టర్‌ స్థాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు అన్నింటిలో 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉంచుతున్నాం.
  • ప్రతి ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షలు కేటాయించి, అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలో రైతులనే నిర్ణయించుకోమని చెప్పాం. వాళ్ల నిర్ణయం ప్రకారం రూ.15 లక్షల మేరకు ఆ యంత్రసేవలన్నీ వారి అవసరాల మేరకు తీసుకొస్తున్నాం. 
  • 491 క్లస్టర్‌ స్థాయి సెంటర్లలో వరి బాగా పండుతున్న చోట కంబైన్డ్‌ హార్వెస్టర్లు తీసుకు రావాల్సిన అవసరం ఉందని గుర్తించాం. అక్కడ ఒక్కో క్లస్టర్‌ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను రూ.25 లక్షల వ్యయంతో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఇందుకు రూ.1052 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రూపులుగా ఏర్పడిన రైతులు కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. 40 శాతం ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. మిగిలిన 50 శాతం రుణాల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులకు అందుబాటులోకి తీసువస్తున్నాం. 

వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ 

  • ఆర్బీకే స్థాయిలో ఏ రైతు అయినా ఈ యంత్రాలను అతి తక్కువ అద్దెతో వాడుకునేందుకు వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈ యాప్‌ సహాయంతో 15 రోజులు ముందుగానే వ్యవసాయ ఉపకరణాలను బుక్‌ చేసుకోవచ్చు. వీటి వల్ల మంచి జరగాలని, ప్రతి ఆర్‌బీకే పరిధిలోని రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. 
  • ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 7 లక్షల మంది రైతులకు మంచి చేస్తూ.. వారికి అవసరమైన స్పేయర్లు, టార్ఫాలిన్లు, వీడర్లు వంటి వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను నిరుపేదలైన రైతులకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆర్బీకే వ్యవస్థను పటిష్టం చేస్తూ, రైతులకు ఇంకా మంచి జరగాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం.

ఆర్బీకే స్థాయిలో ఏ రైతు అయినా ఈ యంత్రాలను అతి తక్కువ అద్దెతో వాడుకునేందుకు వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈ యాప్‌ సహాయంతో 15 రోజులు ముందుగానే వ్యవసాయ ఉపకరణాలను బుక్‌ చేసుకోవచ్చు. వీటి వల్ల మంచి జరగాలని, ప్రతి ఆర్‌బీకే పరిధిలోని రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. 

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 7 లక్షల మంది రైతులకు మంచి చేస్తూ.. వారికి అవసరమైన  స్లే్పయర్లు, టార్పాలిన్లు, వీడర్లు వంటి వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను నిరుపేదలైన రైతులకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆర్బీకే వ్యవస్థను పటిష్టం చేస్తూ, రైతులకు ఇంకా మంచి జరగాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం.

ఇంతటి ఘన కార్యం ఎక్కడా లేదు
గతంతో పోలిస్తే వ్యవసాయ రంగం యాంత్రీకరణ దిశగా కొనసాగుతోంది. పొలాల్లో పని చేసేందుకు కార్మికులు ఆశించిన స్థాయిలో దొరకడం లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా పంపిణీ చేశారు. రైతు కోరుకున్న కంపెనీ, కోరుకున్న ధరలో అందజేస్తున్నాం. ఇంతటి ఘన కార్యం చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరనడం అతిశయోక్తి కాదు. అందుకే రైతాంగం ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతుంది. – ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఏపీ స్టేట్‌ వ్యవసాయ మిషన్‌ 
  
దేవుడిలా కరుణ చూపుతున్నారు
ఈ ముఖ్యమంత్రి లేకపోతే రైతాంగం ఏమైపోయేదో. ఇన్‌పుట్‌ సబ్సిడీ మొదలు.. రైతు భరోసా, బీమా, ట్రాక్టర్ల పంపిణీ.. ఇలా ఒకటి కాదు.. అనేక వరాలు కురిపిస్తున్న మహనీయుడు సీఎం జగన్‌. సాక్షాత్తు దేవుడిలా మమ్మల్ని ఆదుకుంటున్నారు. నాకు అందించిన ట్రాక్టర్‌ విలువ రూ.8.30 లక్షలు. అందులో నాకు సుమారు రూ.3.3 లక్షలు సబ్సిడీ కింద వచి్చంది. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం...  – వి.వెంకటేశ్వరరావు, పచ్చలతాడిపర్రు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా   

నాతోపాటు పదిమందికి జీవనోపాధి
ఈ ట్రాక్టర్‌ కారణంగా నేను ఉపాధి పొందడంతో పాటు తోటి రైతులకు కూడా సాయం చేసే వీలుంటుంది. వ్యవసాయం లేనిదే దేశం లేదు. అందుకే ముఖ్యమంత్రి రైతులను ఆదుకుంటే వ్యవసాయం బతుకుతుందని మాకు చేయూతనిస్తున్నారు. పండుగ వాతావరణంలో ట్రాక్టర్లు అందించారు. నా ట్రాక్టర్‌  విలువ సుమారు రూ.9 లక్షలు అందులో నాకు రూ.3.60 లక్షలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే చెల్లించింది. – బి.డేవిడ్, పొన్నూరు రూరల్, గుంటూరు జిల్లా 
 
సీఎం రుణం తీర్చుకుంటాం 
రైతుల కష్టాన్ని చూసిన ముఖ్యమంత్రి వారి కష్టాలను ఆయన భుజాన వేసుకున్నారు. గతంలో వర్షాల కోసం ఆకాశాన్ని చూసే రైతులు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అంతగా ఈ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటోంది. ముఖ్యమంత్రి రుణం రానున్న కాలంలో తప్పక తీర్చుకుంటాం. – ఎన్‌.మణికంఠ, బ్రాహ్మణకోడూరు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా 

ఇలాంటి సీఎం ఎక్కడా ఉండరు
నాకు ట్రాక్టర్‌తోపాటు రైతు వారీగా చాలా పథకాలు అందుతున్నాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రోటోవేటర్, తైవాన్‌ స్ప్రేయర్లు, నా బిడ్డలకు జగనన్న దీవెన, నా భార్యకు ఉన్న ఊళ్లోనే జగనన్న ఇల్లు వచి్చంది. దీంతోపాటు అతి ముఖ్యమైనది పంటకు మద్దతు ధర. అందుకే ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు. – డి.కోటేశ్వరరావు, చిర్రావూరు, తాడేపల్లి, గుంటూరు జిల్లా 
  
థ్యాంక్యూ సీఎం సార్‌.. 
నేను బీటెక్‌ చదువుకుని నాన్న ప్రోత్సాహంతో వ్యవసాయం చేస్తున్నాను. దాదాపు 30 ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాం. మాకు ట్రాక్టర్‌ చాలా అవసరం. 40 శాతం సబ్సిడీపై ట్రాక్టర్‌ను ప్రభుత్వం అందజేసింది. ఇది నా ఉపాధికి ఎంతో ముఖ్యం. ముఖ్యమంత్రి దూరదృష్టి కారణంగా మాలాంటి యువత వ్యవసాయంవైపు చూస్తోంది. థ్యాంక్స్‌ టు సీఎం సార్‌. – ఎం.సాయిరాం, చిట్టూర్పు, కృష్ణా జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement