
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును రాష్ట్ర పోలీసు నియామక మండలి పొడిగించింది. ఇటీవల 611 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వయో పరిమితి రెండేళ్లు సడలింపునిచ్చిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023, జనవరి 7 వరకు పొడిగించింది. ఈ మేరకు పోలీస్ నియామక నోటిఫికేషన్‌ను సవరించింది. ఎస్‌ఐ పోస్టులకు మాత్రం ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం జనవరి 18లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.