సుమారు 400 మందిని మోసం చేసిన పీలేరు యువకుడు
రూ. 10 కోట్లు స్వాహాచేసినట్లు ఆరోపణలు
వైఎస్సార్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కలి ్పస్తామని సుమారు రూ. 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన పీలేరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పలువురు బాధితులు పీలేరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఎస్‌ఐ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన రెడ్డిసూర్యప్రసాద్ అలియాస్ భరత్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ అడ్డదారిలో సంపాదించడానికి నిరుద్యోగులకు వల వేశాడు.
ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 400 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. రెండు నెలల పాటు వేతనాలు సక్రమంగా చెల్లించి నమ్మించాడు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో మోసపోయిన కొంత మంది యువకులు తాము డబ్బులు చెల్లించిన బ్యాంకు అకౌంట్ చిరునామాను గుర్తించారు. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూ రు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు 400 మంది నిరుద్యోగులు మోసపోయినట్లు తెలుసుకున్నారు. పలువురు బాధితులు తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment