
సాక్షి, తూర్పు గోదావరి: బొండాల రకం ధాన్యం పండించిన రైతులు దళారుల మాటలు నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. దళారుల మాటలు నమ్మి పంటను విక్రయించొద్దని రైతులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొండాల రకం ధాన్యం పండిందని తెలిపారు. ఇందులో 95 శాతం పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
బొండాల రకం ధాన్యాన్ని క్వింటా రూ.1868 చొప్పున.. 75 కేజీలు రూ.1,401గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని గుర్తుచేశారు. రైతులకు సమస్యలుంటే కమాండ్ కంట్రోల్ నంబరు: 88866 13611కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. రైతుభరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.
చదవండి: Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ
Comments
Please login to add a commentAdd a comment