
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు కోరుతూ కార్మిక సంఘాల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరనున్నారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేంకగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలపుతాం’’ అన్నారు.