Trade union leaders
-
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
హత్య కేసులో చోటా రాజన్‌కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్‌కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
మీ చిరునవ్వుల్లో సకల సంతోషాలు
‘‘ఉద్యోగులను సంతోషంగా ఉంచేందుకు నా తరపు నుంచి ప్రతి కార్యక్రమాన్ని మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నా. ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నా..’’ – ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఉద్యోగులు సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కొందరు రాజకీయ కారణాలతో చెప్పే అంశాలను ఉద్యోగులు విశ్వసించనక్కరలేదని, నా మనసు ఎప్పుడూ మీకు మంచి చేయడం కోసమే ఉంటుందని..అన్నింటినీ పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్తగా జీపీఎస్ తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈమేరకు ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి ఉద్యోగులకు సంబంధించి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని, ఈ విషయంలో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డైలీవేజ్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉభయులకూ ప్రయోజనకరంగా జీపీఎస్ సమస్యలను అలాగే వదిలేయకుండా ప్రతి ఒక్క అంశానికీ పరిష్కారం చూపేందుకు తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని సీఎం చెప్పారు. ఉద్యోగులకు మంచి జరగాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరగాలనే ఆలోచన చేశామన్నారు. దాదాపు రెండేళ్లు కసరత్తు చేసిన తరువాత ఉభయులకూ ప్రయోజకరంగా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించామని వెల్లడించారు. భవిష్యత్తు తరాలూ చెప్పుకునేలా.. ఇదంతా అయ్యే పని కాదని 2003లో ప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు. ఆ పరిస్థితి తలెత్తకుండా, ఉద్యోగులు రోడ్డు మీదకు రాకూడనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేశామని తెలిపారు. ఆ రోజు వైఎస్ జగన్ ఉద్యోగులకు మంచి చేశారని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి చేశారనే మాట భవిష్యత్తు తరంలో కూడా వినిపించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బేసిక్ వేతనంలో కనీసం 50 శాతం పెన్షన్ వచ్చేలా ఉద్యోగులు ఈ రోజు తీసుకుంటున్న జీతం బేసిక్‌లో కనీసం 50 శాతం పెన్షన్‌గా వచ్చేలా జీపీఎస్ రూపొందించడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రిటైరైన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా కొనసాగేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చామన్నారు. జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అధికారంలోకి వచ్చాక 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించామని, భవిష్యత్తులో వారి నుంచి వైఎస్ జగన్ తమకు మంచి చేశాడన్న మాట రావాలే కానీ మరో మాట రాకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలని చిత్తశుద్ధితో కృషి చేశామని, ఇంత సిన్సియర్‌గా పరిష్కారం వెతికిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. భవిష్యత్‌లో జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఈ పథకం ఉద్యోగులకు మేలు చేస్తుందని, వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని పేర్కొంటూ మిమ్మల్ని పూర్తిగా భాగస్వాములుగా చేసుకున్నామని, మీ మొహంలో చిరునవ్వు ఉంటేనే బాగా పని చేయగలుగుతారని, ప్రజలూ సంతోషంగా ఉంటారని చెప్పారు. -
సెల్యూట్ సీఎం సార్
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 13,000 మంది ఉద్యోగులకు మేలు ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు. జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు. జీపీఎస్‌తో ఎంతో మేలు కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు. – పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు. – రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉన్నాం సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. – గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రుణపడి ఉంటాము చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. – ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. –డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ 10వేల కుటుంబాల్లో వెలుగులు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు. – బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -
ఓట్ల కోసం రాజకీయం చేయట్లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల కోసం రాజకీయాలు చేయట్లేదని.. సమాజంలోని అంతరాలను తగ్గించి.. అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు విద్య, వైద్యం, ఆరోగ్య కల్పన కోసమే అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డికి సచివాలయంలో కేటాయించిన చాంబర్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం మరో సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో వారు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు 4.70 కోట్ల మంది ప్రజల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అటువంటి ఉద్యోగుల కోరికలు, ఆకాంక్షలను తాము ఎప్పుడూ గౌరవిస్తామన్నారు. కానీ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ కంటే తీసిపోని విధంగా ఉద్యోగులకు మేలు చేస్తున్నామని, అందుకే సీఎం జగన్ ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య సంధానకర్తగా ప్రత్యేక సలహాదారును నియమించినట్లు వివరించారు. ఇటీవల ఎంఈవో పోస్టుల భర్తీ విషయంలో ఒకరిద్దరు కోర్టులకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. త్వరలోనే వర్సిటీలు, ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా ఉత్తర్వులు వస్తాయన్నారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకూ రిటైర్మెంట్ వయసును పెంచే అంశం పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. చంద్రబాబుకు చివరి ఎన్నికలు మరోవైపు.. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని, ఆయన అనుకున్నట్లే దేవుడు తథాస్తు అంటాడని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ప్రజలు కూడా ఇంటికి పంపించేలా తీర్పు ఇస్తారన్నారు. బాబు అధికారంలో ఉంటే అరిష్టం చుట్టుకోవడంతో పాటు అతివృష్టి, అనావృష్టి ఆవరిస్తుందన్నారు. అసెంబ్లీలో ఆయన కుటుంబ సభ్యుల ప్రస్తావన తేకున్నా.. సానుభూతి కోసం డ్రామాలాడటం నీచమని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగులతో రాజకీయాలు చేయం: సజ్జల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య గత ప్రభుత్వం విభేదాలు సృష్టించి వాడుకుని వదిలేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కానీ, తమకు ఉద్యోగులతో రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదన్నారు. సీఎం టీంలో ఉద్యోగులు ఒక భాగమన్నారు. అన్ని సంఘాలను సమానంగా చూస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితులను బట్టి ఉద్యోగులకు వీలైనంత మేలుచేసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చంద్రబాబుకు 2019లోనే చివరి ఎన్నికలయ్యాయని, అప్పుడే ప్రజలు తిరస్కరించారని సజ్జల అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాలను ఆయన ఎప్పుడూ సద్వినియోగం చేసుకోలేదన్నారు. ఇప్పుడు దింపుడు కళ్లెం ఆశలా చేస్తున్న ప్రయత్నంలోనూ దిగజారుడుతనం చూపిస్తున్నాడన్నారు. ఈసారి ఎన్నికల్లో 23 సీట్లనూ తీసేసేలా ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్నారు. తనను అధికారంలో కూర్చోబెట్టడం ప్రజల బాధ్యత అన్నట్లు హెచ్చరిక మాటలు బాబు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. -
సీఎం జగన్ గుండె ధైర్యం ఎంతో గొప్పది
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం ఎంతో గొప్పదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రశంసించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఎస్ఆర్ఏ) ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఏపీ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఏఎన్‌యూలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవీందర్‌రెడ్డి ప్రసంగిస్తూ భూములు రీ సర్వే చేయించాలంటే ఆ ముఖ్యమంత్రికి ఎంతో దమ్ముండాలని చెప్పారు. ఏపీలో భూముల రీ సర్వే ప్రారంభించిన సీఎం ఎంతో ధైర్యవంతుడన్నారు. రెవెన్యూకి సంబంధించిన సంస్కరణలు, సేవల్లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోందని, ఎన్నో అంశాలలో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.గౌతంకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూకి పూర్వవైభవం తెచ్చిన మహోన్నత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు, పాలకులు రెవెన్యూని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టినా.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కొత్త ఉద్యోగాలు కల్పించడం, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వంటి ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూకి జీవం పోశారని చెప్పారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రెవెన్యూలో ఆదర్శవంతమైన సంస్కరణలు తెస్తున్నారని ప్రశంసించారు. -
సాంకేతిక సమస్యే కారణం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌లో నిధులు క్రెడిట్, డెబిట్ కావడానికి సాంకేతిక సమస్యే కారణమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం తమను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో అధికారులు చర్చించారు. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జీపీఎఫ్‌లో డబ్బు మాయంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ట్రెజరీ, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. 2018 జూలై 1 నుంచి రావాల్సిన డీఏ ఎరియర్స్ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు తెలిపారన్నారు. సాంకేతికంగా ఏం జరిగిందన్నదానిపై అధికారులు తెలుసుకుంటున్నారని చెప్పారు. జూలై నెలాఖరు లోపు జీపీఎఫ్, మొత్తం డీఏ బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. బిల్లులు ఒకేసారి చేయడం వల్లే.. జీపీఎఫ్‌లో డబ్బు క్రెడిట్, డెబిట్ అంశంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు. సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి.. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారన్నారు. అధికారులను కలిసిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు. -
బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు ఐదేళ్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల)/గోదావరిఖని: సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్లో కోలిండియా చైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన 11వ జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోలిండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాలపరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోలిండియా యాజమాన్యం పట్టుబట్టింది. సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోల్చితే కార్మికుల బేసిక్ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ససేమిరా అన్నాయి. ఐదేళ్ల కాలపరిమితికే అంగీకరిస్తామని చెప్పాయి. దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. మిగతా జీతభత్యాల విషయం ఈ చర్చల్లో కొలిక్కి రాలేదు. డీపీఈ ప్రకారం వేతనాలు మాకొద్దు కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందో యాజమాన్యం లెక్కలేసి చెప్పింది. పీఎస్‌యూల్లో ఉన్న వేతనాలకు అనుగు ణంగా బొగ్గు పరిశ్రమల్లోనూ వేతనాలు ఉండాలని సూచించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ) గైడ్‌లైన్స్ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచుతామంది. కానీ కార్మిక సంఘాల నేతలు డీపీఈ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలు అంగీకరించబోమన్నారు. వేతనాలు, అలవెన్సు పెరుగుదల, కేడర్ స్కీం, సీపీఆర్ఎంఎస్ మెడికల్ స్కీం సవరణ, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వంటి డిమాండ్లను 5 విభాగాలుగా చేసి ప్రత్యేక కమిటీల ద్వారా చర్చిస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మిక సంఘాల నేతలు ఖండించారు. అన్నింటినీ తదుపరి సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్ చేశారు. మిగతా డిమాండ్లపై ఏప్రిల్‌లో జరిగే సమావేశంలో చర్చిస్తామని వేజ్‌బోర్డు సభ్యుడు వి.సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవ్నాయక (బీఎంఎస్), రియాజ్ అహ్మద్ (హెచ్ఎమ్మెస్), మంద నర్సింహారావు (సీఐటీయూ) పాల్గొన్నారు. -
పీఆర్సీపై హర్షాతిరేకాలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో మెరుగైన పీఆర్సీ ప్రకటించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వైఎస్సార్‌టీయూ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి గొండు సీతారాం మాట్లాడుతూ.. ఊరటనిచ్చేలా పీఆర్సీ ఇవ్వడం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఐదు డీఏలు ఒకేసారి చెల్లింపునకు అంగీకారం తెలపడం హర్షణీయమన్నారు. పీఆర్సీ పాత పద్ధతిలో ఐదేళ్లకోసారి అమలుకు అంగీకరించటం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఆర్థిక లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏ అంశాలు, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీపీఎస్ పునరుద్ధరణకు రూట్ మ్యాప్, పూర్తిస్థాయిలో హెల్త్ కార్డులు స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం, కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల వారసులకు వీలైనంత త్వరితగతిన ఉద్యోగాలు కల్పించడం, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించేందుకు అంగీకరించడం, పీఆర్సీ రిలేటెడ్ 9, ఇతర 4 అంశాలు తదితర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అనుకూల సంకేతాలు రావడం శుభపరిణామం అన్నారు, మంత్రివర్గ ఉప సంఘం, చీఫ్ సెక్రటరీతో జరిగిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంగీకార సంతకాలు చేసి బయటకొచ్చి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు డి.పోలరావు, ఎల్లయ్య, బి.తాతారావు, వెంకునాయుడు, సత్యం, పి.ఎల్లారావు, కె.రామునాయుడు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
AP: ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఒకచోట కాకపోతే మరో చోట మేలు చేయాలన్న ఆలోచనతో పలు నిర్ణయాలు తీసుకున్నామనే విషయాన్ని గమనించండి. మీరు రిటైర్ అయ్యాక కూడా బాగా జీవించేందుకు ఏం చేస్తే బావుంటుందో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ మీతో చర్చించాకే అడుగులు ముందుకు వేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మీది.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. మీరు లేకపోతే నేను లేను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్సీకి సంబంధించి తాము లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళనను విరమించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు... ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరినీ సంతోషంగా చూడటం చాలా ఆనందం కలిగించిందన్నారు. ‘‘మీ అందరికీ వినయపూర్వకంగా మరోసారి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం మీది. ఆ విషయం మనసులో ఉంచుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ఈ రోజు నేను నాలుగడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడున్న ఒమిక్రాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఆశించిన రీతిలో ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ మనసా.. వాచా.. కర్మణా.. ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం. మొత్తంగా మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా తాను సన్నద్ధంగా ఉన్నానన్నది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయాలకు తావు ఉండకూడదు ఉద్యోగుల్లోకి, ఉద్యమాల్లోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. ఏ సమస్య ఉన్నా రండి. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో ఏర్పాటయిన హైపవర్ కమిటీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా, వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది. ఉద్యోగులూ ఇందులో భాగమే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గం ఉంది. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ అందరికీ ఇదే నా అభ్యర్థన. మొత్తంగా రూ.11,577 కోట్లు భారం ► నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్‌లో ఉంది. నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పింది. ఆ నిర్ణయాలు మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ► ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గాను, 9 నెలల కాలాన్ని సర్దుబాటు నుంచి మినహాయించాం. అలా చేయటం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు అదనంగా భారం పడుతోంది. హెచ్ఆర్ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5,725 కోట్లు అదనపు భారం. ► ఇది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వల్ల మరో రూ.450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1,330 కోట్లు భారం పడుతోంది. ► ఇంతకు ముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ఏటా పెరుగుతుందనుకుంటే.. దానికి ఈ రూ.1,330 కోట్లు రికరింగ్. అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు భారం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా భారం పడుతుంది. పరిస్థితులు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు చెబుతున్నాను. ఆర్థిక పరిస్థితి బాగుంటే మరింత సంతోష పెట్టేవాడిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.5,725 కోట్లు మీ పోస్ట్ రిటైర్మెంట్కు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే చాలా కష్టం. మనమంతా ఒక్కటిగా కలిసి ముందుకెళదాం. పరిస్థితులు ఇలా ఉండకపోయి ఉంటే.. మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మీరంతా నా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చే పరిస్థితులుండేవి. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు లేవు. సీపీఎస్‌పై గట్టిగా పని చేస్తున్నాం భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. సీపీఎస్ మీద అన్ని వివరాలు తీసుకుని గట్టిగా పని చేస్తున్నాం. ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్ బాగా పెరిగేలా చూస్తాను. ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యాక.. గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్ గొప్ప మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. అదే జగన్ ప్రభుత్వం మీకు చేయబోయే గొప్ప మేలు. అంత దూరం ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న పరిస్థితికి భిన్నంగా మీకు ఏ విధంగా మంచి చేయాలనే దానిపై చాలా అధ్యయనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది. రిటైర్ అయ్యాక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఒక మంచి పరిష్కారంతో వస్తాం. ఇందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను. ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది చర్చిస్తాం. అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల సానుకూలంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 30 వేల మంది టీచర్లకు పదోన్నతులు 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పే ఇవాళ్టి పరిస్థితి మారాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్స్ ఉండేలా చూస్తున్నాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. దీనివల్ల ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు. ప్రిపేర్ అయి బాగా చెప్పగలుగుతాడు. ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేశాం. బైలింగువల్ టెక్స్›్ట బుక్స్.. అంటే ఒకపేజీ తెలుగు, పక్క పేజీలో అదే ఇంగ్లిష్‌లో ఉండటం వల్ల పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. టీచర్ల కెపాసిటీ పెరుగుతుంది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పొడిగింపు ► ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. అందరు కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం. ఎక్కడైనా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దానివల్ల 24 నెలల జీతం రూపేణా మరో చోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ఎంఐజీ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం. ► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదాయం పెరగకపోగా పడిపోయింది రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. 2018–19లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు. మామూలు పరిస్థితుల్లో అయితే 2019–20లో అది 15 శాతం పెరిగి రూ.72 వేల కోట్లు అయ్యుండాలి. కానీ ఒక్కశాతం కూడా పెరగకపోగా తగ్గి రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2020–21లో మళ్లీ 15%పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84 వేల కోట్లు కావాలి. అలాంటి పరిస్థితులు ఉండి... అప్పుడు మన చర్చలు సాగుతుంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ 2020–21లో కూడా ముందటి సంవత్సరంకన్నా ఒక్క రూపాయి కూడా పెరగకుండా రాష్ట్రాదాయం రూ.60 వేల కోట్లలోపే ఉండిపోయింది. మరోవైపు జీతాల బిల్లు మాత్రం ఏటేటా పెరుగుతూ వస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేలు వర్తింపచేశాం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్ల జీతాలు అన్ని రకాలుగా పెంచాం. వీటన్నింటి వల్ల 2018–19లో ఉన్న రూ.52 వేల కోట్ల శాలరీ బిల్లు ఈ ఏడాది రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజా నిర్ణయాలతో ఇప్పుడు మళ్లీ సుమారు రూ.11 వేల కోట్లు అదనంగా పడుతోంది. అంటే రూ.78వేల కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మన చర్చలు జరిగాయన్నది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను అని. అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే అది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్థలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. -
AP: ఆందోళన విరమణ
ఒప్పంద వివరాలివీ.. ► ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు ► 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్ఆర్ఏ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్ఆర్ఏ ► 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు.. ఈ జనవరి నుంచి అమలు ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్ఆర్ఏ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్ వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ► రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం ► 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల ► సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► 2022 జూన్ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు. సాక్షి, అమరావతి: మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటిస్తూ.. చొక్కాలకు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలను తొలగించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల కోరికలపై సీఎం వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్లో వివరించగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి సంయుక్తంగా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చర్చోప చర్చలు.. తొలుత ఉదయం మంత్రుల కమిటీలో ఉన్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి శుక్రవారం జరిగిన చర్చల వివరాలను తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఉద్యోగులు కోరిన మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆర్థిక శాఖాధికారులతో చర్చించారు. అనంతరం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపారు. ఏకాభిప్రాయంతో సానుకూలంగా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో వారు సమ్మె విరమించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల ఆవేదన గుర్తించాం.. పీఆర్సీ తదనంతర పరిణామాలపై నిన్న (శుక్రవారం), ఈరోజు (శనివారం) సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే అడక్కుండానే సీఎం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం మొదటి నుంచి చెబుతున్నారు. ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చారు. పీఆర్సీ కూడా వారికి బాగా ఇవ్వాలని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయి. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు నిజంగా ఇది గుడ్ డీల్ ఈ రోజు ఉద్యోగులకు గొప్ప శుభదినం. వ్యవస్థలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. వాటిని నేర్పుతో, ఓర్పుతో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండే మంచి బెనిఫిట్స్ వచ్చి ఉండేవని ఆశించేవాళ్లం. కానీ ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారు. కొన్ని అంశాలలో అన్యాయం జరగడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈరోజు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగాం. పీఆర్సీ కోసం ఏర్పాటైన అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేము లేవనెత్తిన డిమాండ్లలో ప్రధానమైన ఐఆర్ రికవరీ నిలిపి వేయడం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లు సరిచేయడం, పెన్షనర్స్‌కు అదనపుæ క్వాంటంను పునరుద్దరించడం, ఐదేళ్ల కోసారి పీఆర్సీ ఏర్పాటు చేసే అంశాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆర్టీసీలో పీఆర్సీ అమలుకు ప్రత్యేక ఉత్తర్వులిస్తామన్నారు. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకోవడంతో మార్చి 31వ తేదీలోగా రోడ్‌మ్యాప్ డిక్లేర్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1993 నవంబర్ 25కు ముందున్న ఎన్ఎంఆర్ కంటిజెంట్ ఎంప్లాయిస్ను కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలన్న హామీని కూడా అంగీకరించారు. విలేజ్, వార్డు సచివాలయ సిబ్బందికి జూన్ 30లోగా ప్రొబెషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ స్టీమ్‌లైన్ చేసే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు. పీఆర్సీ రిలేటెడ్ అంశాలు 9, ఇతర సమస్యలు 4 అంశాలు తాము లేవనెత్తగా, తాము డిమాండ్ చేయని మరో నాలుగు అంశాలు కలిపి..17 అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. నాలుగు జేఏసీల తరఫున పీఆర్సీ సాధన సమితి ఏకగ్రీవంగా ఈ డిమాండ్లను ఆమోదిస్తూ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మంత్రులు, సీఎస్, ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడి ఉంటే మన్నించగలరు. – సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన మీదట సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే తిప్పలు పడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సీఎం చొరవతోనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గంటల కొద్దీ చర్చించాం. చివరిలో కావాలని చేసినట్టు ఒకరిద్దరు ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలపై సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే సమస్య పరిష్కారమైంది. రాష్ట్రం ఇంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పడినా వాటిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – మంత్రి పేర్ని నాని ప్రభుత్వానికి కృతజ్ఞతలు రెండు రోజులుగా చీఫ్ సెక్రటరీ, మంత్రి మండలి ఉప సంఘంతో జరిపిన చర్చలు అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో సాగాయి. మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపి.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల్ల పట్ల ప్రేమాభిమానాలను స్పష్టం చేసింది. మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించి, మేము లేవనెత్తిన డిమాండ్లపై కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా ఎన్నో చేశారు. అందువల్లే మరింత మెరుగైన పీఆర్సీ ఇస్తారని ఆశించాం. అదే స్థాయిలో చాలా వరకు ఇచ్చారు కూడా. అయితే కొన్ని అంశాల్లో మాకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఛలో విజయవాడలో కొంత మంది మాకేదో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యల విషయంలో అన్యధా భావించవద్దు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి చెబుతుంటారు. ఏది ఏమైనా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఐదు డీఏలు ఒకేసారి ఇవ్వడంతో పాటు మేము కోరుకున్నట్టుగా హెచ్ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీసీఎస్‌ను పునరుద్దరించడం కోసం రూట్‌మ్యాప్ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పీఆర్సీ సాధన సమితి సభ్యుడు సీఎం చొరవ అభినందనీయం ముఖ్యమంత్రికి ఉద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. 3వ తేదీన భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డుమీదకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి.. 24 గంటలు గడవక ముందే సీఎం స్పందించి మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండ్రోజులుగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనలతో మంత్రుల కమిటీ మాతో సుదీర్ఘంగా చర్చించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను కనుక్కోవడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయం. ముఖ్యమంత్రికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కువగా రాజీకి వచ్చే అవకాశం లేకుండానే మేము పెట్టిన చాలా డిమాండ్లలో ఒకటి రెండు తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న హెచ్ఆర్ఏ కొనసాగించాలనే డిమాండ్ మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సీసీఎస్ కొనసాగేలా అంగీకరించినందుకు కృతజ్ఞతలు. 10 ఏళ్ల పీఆర్సీ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి అమలు చేయడం గొప్ప నిర్ణయం. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించారు. మా ఆవేదనలో హద్దుమీరి ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. వారి తరఫున ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నాం. – కె వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మా సమస్యలు పరిష్కారం ఊహించని రీతిలో మంత్రులు కమిటీ ముందుకొచ్చి మా డిమాండ్ల పరిష్కార దిశగా సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ఒకేసారి ఐదు డీఏలు ఇవ్వడంతో జీతం పెరుగుతుందన్న ఆలోచనతో హెచ్ఆర్ఏ, సీసీఏలు, పెన్షనర్ల బెనిఫిట్లు పూర్తిగా తొలగించడం, కొన్ని తగ్గించడం వంటి చర్యలు వలన ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈరోజు చర్చలనంతరం ప్రధానంగా మేము కోరుతున్న పీఆర్సీ నివేదికను ఉత్తర్వులతో పాటు ఇస్తామని చెçప్పడం మాకు చాలా సంతోషం కల్గించింది. హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో సవరణ, ఐఆర్ రికవరీ చేయడాన్ని నిలుపుదల చేయడం, గతంలో మాదిరిగా పీఆర్సీ 5 ఏళ్ల కోసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, గురుకులాలకు పీఆర్సీ అమలుకు ఉత్తర్వుల జారీ విషయంలో చాలా రోజులు పట్టేది. వీరికి కూడా తక్షణమే పీఆర్సీ అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సపరేట్గా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. పీఆర్సీతో పాటు అనుబంధంగా ఉన్న సీపీఎస్ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ ద్వారా పరిష్కరించే దిశగా సిద్ధం చేస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడానికి ఒప్పుకున్నారు. ఈలోగా ఎంప్లాయిస్ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు హామీ ఇవ్వడం సంతోషం. కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యమ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని పలు సందర్భాల్లో విమర్శించినందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పీఆర్సీ సాధన సమితి నేత -
AP: ఉద్యోగుల ర్యాలీలో రాజకీయ సందడి
సాక్షి, అమరావతి: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు సంయమనం ప్రద ర్శించడంతో సాఫీగా జరిగిపోయింది. ఐదు వేల మందితో కార్యక్రమం నిర్వహణకు అనుమతి కోరిన ఉద్యోగ సంఘాల నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు పాల్గొనడమే కాకుండా కార్యక్రమాన్ని ఆసాంతం నడిపిం చారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు జన సమీకరణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కార్యకర్త ఇప్పుడు గెజిటెడ్ అధికారి అయ్యాడంటూ చలో విజయవాడపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. రెండు రోజుల ముందే.. వివిధ ప్రాంతాల నుంచి చలో విజయవాడకు హాజరైన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలవారీగా ఉద్యోగులు బ్యానర్లతో గాంధీనగర్ చేరుకుని అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు ర్యాలీలుగా వెళ్లారు. ఫుడ్ జంక్షన్ నుంచి భానునగర్ వంతెన వరకు నిలుచుని ప్రదర్శన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఓ వాహనంపైకి ఎక్కి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ప్రణాళిక ప్రకారం తరలి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఒక వ్యూహం ప్రకారం రెండు రోజుల ముందే ఉద్యోగులు నగరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డులోకి చేరుకున్నాక కూడా పీఆర్సీ సాధన సమితి నేతలు రాకపోవడంతో అయోమయం నెలకొంది. చివరికి అప్పటికప్పుడు ఒక వాహనంపైకి చేరుకుని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రసంగించారు. ఒకవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు తాము ప్రభుత్వంతో యుద్ధం చేయడం లేదని చెబుతుంటే మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు. సీఎంను ఇంటికి పంపుతామని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు హెచ్చరించారు. -
చర్చోప చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మధ్య మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించిన చర్చలు సానుకూలంగా జరిగాయి. (మరో సభ్యుడు మంత్రి పేర్ని నాని అనారోగ్యంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు) పీఆర్సీ సాధన సమితి నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితర నేతలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. తమకు పాత జీతాలే వేయాలని మరోసారి మంత్రుల కమిటీని కోరారు. దీంతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను ఇవ్వాలన్నారు. అంశాల వారీగా చర్చలు జరిపిన తర్వాత మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. చర్చలకు అందుబాటులో ఉండాలని కోరింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని, ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించవద్దని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను కోరింది. అనంతరం వారు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాగా, మంగళవారం చర్చలు సానుకూలంగా జరిగాయని, మరోసారి మళ్లీ చర్చలు జరుపుతామని సాయంత్రం తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. పీఆర్సీ సాధన కమిటీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విజయవాడ స్పోర్ట్స్: పీఆర్సీ సాధన కమిటీ ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో భారీ ర్యాలీకి పీఆర్సీ సాధన కమిటీ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేసుకుందన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి, సెక్షన్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరించామని చెప్పారు. విజయవాడ నగరంలో కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉందని, ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల మందితో ర్యాలీలు చట్టపరంగానే కాకుండా ఎంప్లాయ్ కాండాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఉద్యోగులెవ్వరూ ఈ ర్యాలీకి రాకూడదని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లొద్దు.. అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆందోళనలు విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎంత చేయాలో అంత చేసిన విషయాన్ని మరోసారి వారికి వివరించాం. ఉద్యోగ సంఘాల నాయకులు పాత పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలైన తర్వాత పాత పీఆర్సీని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలని చెప్పాం. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేయడం ఏమీ లేదు. ఐఆర్ అనేది కేవలం సర్దుబాటు మాత్రమే. అది రికవరీ కాదు. ఉద్యోగులపై బెదిరింపులు, ఒత్తిళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించే వరకు వెళ్లవద్దని వారిని కోరాం. అధికారుల కమిటీ నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని అన్ని అంశాలు ఉన్నాయని వారికి వివరించాం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చలో విజయవాడను విజయవంతం చేయాలి గురువారం చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు. ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త పీఆర్సీ ప్రకారం నష్ట పోతున్న విషయాన్ని మళ్లీ చెప్పాం. మూడు ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. అవి సాధ్యపడవని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది. అందుకే కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే. మళ్లీ అంతా కలిసి పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. – బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు -
చర్చలే దారి
సాక్షి, అమరావతి: జీతాల విషయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా నష్టపోనివ్వబోమని, కొత్త పే స్లిప్ వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రుల కమిటీ వరుసగా మూడో రోజు సమావేశం అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. షరతులు విధిస్తే ఎలా? పీఆర్సీ సాధన కమిటీ నుంచే కాకుండా ఇతర ఏ సంఘాలు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సజ్జల తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన అవసరం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తెలియచేసే అవకాశం ఇవ్వకుండా చర్చలకు షరతులు విధిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చర్చలు కాకుండా ఇక ఏ మార్గంలో సమస్యకు సాంత్వన లభిస్తుందో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. బాధ్యతాయుత నాయకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మొండి వైఖరి విడనాడి న్యాయబద్ధమైన అంశాలు ఉంటే ప్రభుత్వంతో కలిసి సరిదిద్దుకోవాలన్నారు. సెలవు రోజుల్లో మినహా నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందన్నారు. కమిటీ స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యతిరేకతను పెంచుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులు సంఘాల నాయకులకు సూచించాలని కోరారు. కొన్ని పత్రికలు వక్ర భాష్యాలు చెబుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. చర్చలకొచ్చి.. ఒత్తిడి తగ్గించుకోండి ‘ఉద్యోగ సంఘాల నాయకులు తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. అసలు ఒత్తిడికి గల సమస్యను పరిష్కరించుకోవాలి. సమ్మె తేదీ దగ్గరపడినా.. ఒకవేళ సమ్మెకు వెళ్లాల్సి వచ్చినా అప్పుడైనా చర్చలకు కూర్చోవాలి కదా? సీఎం సమక్షంలో ఫిట్మెంట్ ప్రకటనలో పాల్గొని సమ్మతి తెలిపారు. ఇప్పుడు మళ్లీ పాత పీఆర్సీ కోరడం అంటే పరిపక్వత లేకపోవడమో లేక ఇంకేమంటారో అర్థం కావట్లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. కానీ మేము వాటి జోలికి వెళ్లట్లేదు. ఆర్థిక అంశాల వ్యవహారాలను నిరాకరించడం క్రమ శిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ వ్యతిరేక చర్యల కిందకే వస్తుంది. ఇలాంటివి జరగకుండా చర్చలకు వచ్చి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధ్యతాయుత నాయకులుగా చర్చలకు రావాలే కానీ తాము చెప్పిందే జరగాలని అనుకోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలం
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు తెలియజేశారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పీఆర్సీ ఇస్తామని, తరువాత డీఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఏపీ ఎన్జీవో సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేతలతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► 11వ పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులవుతున్నందున జాప్యం లేకుండా 2018 జులై 1 నుండి 55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ఇవ్వాలని కోరాం. ► డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడిగాం. ► సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కోరాం. ► ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ఆయన స్పందించి అక్కడే ఉన్న సీఎంఓ అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ► కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణపైనా విజ్ఞప్తి చేశాం. ► అలాగే, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుండి 62 ఏళ్ల వరకు పెంచాలని కోరాం. ► మొత్తం మీద ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలిపాం. ► సీఎం జగన్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు కోరుతూ కార్మిక సంఘాల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరనున్నారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేంకగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలపుతాం’’ అన్నారు. -
'విశాఖ స్టీల్'ను అమ్మితే ఊరుకోం
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే ఊరుకోబోమని కార్మీక సంఘాల నాయకులు అల్టిమేటం జారీ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉక్కు నగరంలోని త్రిష్ణా మైదానంలో ఉక్కు కార్మీక గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ కార్మీక సంఘాల నాయకులు హాజరై స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గు గనులు, రైల్వే, బ్యాంకులు, బీమా ఇలా అన్ని రంగాలనూ ప్రైవేటుపరం చేయడానికే జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కార్మీకుల హక్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కాలరాయడానికే అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ కార్మీకుల ఆందోళన ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గనులు కేటాయించని ఏౖకైక ప్లాంట్ విశాఖ స్టీల్‌ప్లాంటే అన్నారు. ఇస్కో, దుర్గాపూర్ స్టీల్, సేలం స్టీల్ప్లాంట్లను కొనడానికి వచ్చిన వారిని తరిమినట్టే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనడానికి ఎవరైనా వస్తే తరిమి తరిమి కొట్టాలన్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ అదానీ, అంబానీల కోసమే మోదీ పని చేస్తున్నారన్నారు. బీఎంఎస్ జాతీయ కార్యదర్శి పాంథే మాట్లాడుతూ లిబర్‌లైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో కార్మీక వర్గాలకు సమస్యలు ప్రారంభమయ్యాయన్నారు. హెచ్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రిజ్వార్ అహ్మద్ మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారని, దేశాన్ని అమ్మడానికి సిద్ధమవుతున్నారన్నారు. ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానికి లేఖలు రాశారన్నారు. కార్మిక సంఘాల నేతలతో చర్చించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే నేడు షిప్‌యార్డు, బీహెచ్‌పీవీ సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నాయన్నారు. -
ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గుజరాత్ సహా దాదాపు పది పారిశ్రామిక రాష్ట్రాలు ఇటీవల పలు కార్మిక చట్టాలను సడలించాయి. దీనిపట్ల ‘సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు సహా పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? యజమానులకా, కార్మికులకా? ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా అధిక పెట్టుబడులు వచ్చి పడతాయా? (లాక్డౌన్: ఆగని విషాదాలు) ఈ విషయంలో జంషెడ్పూర్ బిజినెస్ స్కూల్లో మానవ వనరుల విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్ కేఆర్ శ్యామ సుందర్, దేశంలోనే సిబ్బందిని సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ‘టీమ్ లీజ్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘కార్మిక చట్టాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ఆ దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా కోరుకోలేదు. ఈ మార్పులను కంపెనీల యాజమానులు కూడా కలగనలేదు. ఆశించనూ లేదు. మూడు చట్టాలు మినహా మిగతా అన్ని చట్టాల్లో భారీ మార్పులను తీసుకరావడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందరికన్నా అన్ని రాష్ట్రాలకన్నా అత్యుత్సాహం చూపింది. యూపీతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం కొంచెం సంకుచితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే ఈ మార్పులు కంపెనీ యజమానులకుగానీ, కార్మికులకుగానీ దోహదం చేసేవిలాగా లేవన్నది నా అభిప్రాయం’ అని శ్యామ్ సుందర్ తెలిపారు. కార్మికులకు, యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను చట్టపరమైన ప్రమాణాలు లేకుండా కేవలం ఇరువర్గాల కమిటీలతో ఎలా పరిష్కారం అవుతాయో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సవరణలోతోని చైనా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక నుంచి భారత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు. పైగా చైనా కార్మిక శక్తితో భారత కార్మిక శక్తిని పోల్చలేమని చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో చట్టాలను మార్చడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని, కేంద్ర చట్టాల పరిధి మార్పులు చేసి, వాటి పరిధిలోకి రాష్ట్రస్థాయి చట్టాలను తీసుకరావడం వల్ల ప్రయోజనం ఉంటుందని రితిపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడు కార్మిక చట్టాల ప్రయోజనాలను కార్మికులు పొందుతున్నారని, యాజమాన్యాలు కూడా కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్తిస్తున్నాయని, ఈ తరుణంలో చట్టాలను ఎత్తివేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కార్మికుల్లో, తద్వారా ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందని, అది ఉత్పాదన శక్తిపై ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. (అదే వరస..ఆగని కరోనా కేసులు..) -
ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ!
సాక్షి,హైదరాబాద్: ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ, సర్వీసు రిజిస్ట్రర్ల నిర్వహణ, తదుపరి పీఆర్సీ నుంచి వేతన సవరణ, డీఏ, హెచ్ఆర్ఏ, కన్వినియన్స్, మెడికల్ తదితర అలవెన్సులు, కారుణ్య నియామకాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో వారితో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీటఫ్) ప్రకటించింది. వరంగల్‌లో 23న తలపెట్టిన మహాధర్నాను విరమించుకుంటున్నట్లు ఫ్రంట్ చైర్మన్, కన్వీనర్ పద్మారెడ్డి, శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు శనివారం విద్యుత్ సౌధలో టీటఫ్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిగాయి.న్యాయమైన, సాధ్యమైన అన్ని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అంగీకరించారు. స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో 23 వేలమంది ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సర్వీస్ రూల్స్ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌గా మార్చుతామని అధికారులు హామీ ఇచ్చారు.1999– 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ వర్తింపు వంటి ప్రధాన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మిగిలిన డిమాండ్ల విషయంలో నవంబర్ మూడో వారంలో మరోసారి చర్చలు నిర్వహిస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చాయి.చర్చలు సఫలం కావటంతో కార్మిక సంఘాలు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించాయి.చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్ అధికారులు, కార్మికులు సంతకాలు చేశారు.చర్చల్లో ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, టీటఫ్ చైర్మన్ నాయకులు సాయిబాబు, ఎంఏ వజీర్, ఎస్. ప్రభాకర్, ఎండీ అబ్దుల్ మజీద్, సాయిలు, టీఆర్వీకేఎస్ అధ్యక్షుడు జాన్సన్, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ పాల్గొన్నారు. ఒప్పందంలోని ప్రధానాంశాలు ►స్టాండింగ్ ఆర్డర్స్ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌గా మార్పు ►ప్రస్తుతం ఆర్టిజన్లు పొందుతున్న కన్సాలిడేటెడ్ వేతనాన్ని సంరక్షిస్తూనే, ప్రస్తుత నోటిఫైయిడ్ స్కేల్‌కు అనుగుణంగా 2019 అక్టోబర్ 1 నాటి నుంచి ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ (పే ఫిక్సేషన్) చేస్తాం.కనీస స్కేలును వేతనం మించితే వారి వ్యక్తిగత అలవెన్సులుగా పరిగణించబడుతాయి. ►నోటిఫైయిడ్ స్కేల్ ప్రకారం వీడీఏకు బదులు డీఏ చెల్లింపు. ►హెచ్ఆర్ఏ, సీసీఏ, వైద్య ఖర్చులు, రవాణా భత్యం, కార్పొరేట్ అలవెన్స్ వర్తింపు. ►ఆర్టిజన్లందరికీ సర్వీసు రిజిస్ట్రర్లు తెరిచి సర్వీసు రిజిస్ట్రర్‌లో వేతన స్థిరీకరణ ఎంట్రీలు నమోదు ►ఆర్టిజన్లందరికీ పే స్లిప్పులు జారీ ►పెయిడ్ హాలిడేలు వర్తింపు ►తదుపరి వేతన సవరణ కాలం నుంచి ఆర్టిజన్లకు సైతం వేతన సవరణ అమలు ►2016 డిసెంబర్ 4 తర్వాత మరణించిన ఆర్టిజన్ల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన. ►ఆర్టిజన్లపై క్రమశిక్షణ చర్యలను అధీకృత అధికారి మాత్రమే పరిశీలిస్తారు ►ఆర్టిజన్లకు వర్తింపజేసిన సదుపాయాలను రెస్కో ఉద్యోగులకు వర్తింపు ►ఆర్టిజన్లకు అంత్యక్రియల చార్జీలు చెల్లింపు ►ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ అమలు చేసే అంశంపై చర్చించేందుకు టీటఫ్ బృందాన్ని సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ►యూనియన్ల ప్రతిపాదనల మేరకు ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌కు సవరణలు చేస్తారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్మిక నాయకులు
సాక్షి, విజయవాడ: టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల మంది సభ్యులు ఉన్న టీడీపీ మెడికల్ వింగ్‌కు చెందిన పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీలో చేరిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నెస్సార్ మూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాము కలిసి.. సమస్యలు విన్నవించుకున్నామని, తమను అక్కున చేర్చుకుని సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్ జగన్ మాటిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అందిస్తున్న జనరంజక పాలన చూసి వైఎస్సార్ సీపీలో చేరామని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
నేతన్నల పోరుబాట..
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ‘సమ్మె’ట - నేటి నుంచి పవర్‌లూం కార్మికుల సమ్మె సాక్షి, సిరిసిల్ల: కూలీ గిట్టుబాటు కోసం నేతన్నలు పోరుబాట పట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, కార్మికులకు నెలకు రూ.15 వేల కూలీ వచ్చేట్లు చూడాలని చెప్పినా యజమానులు పెడచెవిన పెట్టడంతో కార్మికులు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారుల సమక్షంలో యజమానులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలం కావడంతో 8వ తేదీ నుంచి సమ్మెకు వెళుతున్నట్లు నేత కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న నేత కార్మికుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధి ఆర్డర్లు పెద్దల ఖాతాల్లోకి వెళుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాన్ని అమలు చేయాలి కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందో ళన బాట పట్టారు. అలాగే కార్మికుల ఆత్మహత్యల నివారణకు, శాశ్వత ఉపాధి కల్పనకు ప్రతి కార్మికుడికి నాలుగు సాంచాలు, వర్క్‌షెడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్తంభించనున్న 35 వేల మరమగ్గాలు రాష్ట్రవ్యాప్తంగా మరమగ్గాలు (పవర్‌లూం) సిరిసిల్లలోనే అధికం. ఇక్కడ 45 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 35 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గాలకు అనుబంధంగా వార్ఫిన్, ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తుంటాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఏటా సుమారు రూ.350 కోట్ల విలువైన వస్త్రాన్ని పవర్‌లూంలపై తయారు చేస్తుంటారు. సోమవారం నుంచి పవర్‌లూం కార్మికులు సమ్మెలోకి వెళుతుండడంతో 35 వేల మరమగ్గాలు స్తంభించనున్నాయి. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటనకై నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్‌లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో హింద్ మజ్దూర్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నదన్నారు. దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఐక్యంగా ప్రభుత్వం ముందుంచిన 12 డిమాండ్లను మొండిగా నిరాకరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మె భేరీ మోగించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకై నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. -
సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరగాలి
కడప అగ్రికల్చర్ : సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. మంగళవారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో కార్మిక సంఘ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మీ, హరికృష్ణ, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను సవరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. సంఘాలు ఏర్పాటు చేయనీయకుండా కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు అవసరమైన విధంగా సవరణలు చేయడం లేదన్నారు. సెప్టంబరు నెల 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు. 1923లో కార్మిక చట్టం, 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం, 1948లో వేతనాల చెల్లింపుల చట్టం, 1952లో భవిష్యనిధి చట్టం తీసుకువచ్చినా ఆ చట్టాలన్నీ 60, 70 ఏళ్లనాటివేనని తెలిపారు.వీటన్నింటిని సమయానుకూలంగా కంపెనీలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారేగాని కార్మికులకు ఉపయోగపడడం లేదన్నారు. చట్ట సవరణ ముసుగులో హక్కులు కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కార్మిక చట్ట సవరణలో కనీస వేతనాలు రూ. 15000లు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌తో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలోకి వెళ్లాలని కోరారు. సదస్సులో ఐఎన్టీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకొమ్మదిన్నె సుబ్బరాయుడు, నగర అధ్యక్షుడు వెంకటరామరాజు, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామ్మోహన్, వైఎస్సార్‌టీయుసీ అధ్యక్షుడు అందె సుబ్బరాయుడు, బీఎంఎస్ జోనల్ కార్యదర్శి రమణ,హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుబ్బిరెడ్డి, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు. -
భక్తులకు సరిపడా బస్సులు : ఆర్టీసీ ఎండీ
తొర్రూరు : పుష్కర భక్తులకు ప్రతీ డిపో నుంచి సరిపడా బస్సు సర్వీసులు న డిపిస్తున్నామని ఆర్టీసీ ఎండీ జీబీ రమణారావు తె లిపారు. శనివారం తొర్రూరు డిపోలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇ ప్పటికే 2,341 బస్సు ద్వారా సుమారు 3.65 లక్షల మంది భక్తులను పుష్కరాలకు తరలించామన్నారు. ప్రధానంగా భద్రాచలానికి 808, కాళేశ్వరానికి 542, ధర్మపురికి 422 బస్సులు నడిపిస్తున్నామన్నారు. పు ష్కర స్నానాలు ఆచరించిన 2.58లక్షల మందిని 1.422 బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఈనెల 25వ తేదీ వరకు బస్సులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈసందర్భంగా కా ర్మిక సంఘాల నాయకులు ఎండీ రమణా రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ..!
సాక్షి, గుంటూరు : జిల్లాలో నేడు రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. 2014 రోడ్ సేఫ్టీ బిల్‌కు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి, వాహన యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రేడ్ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు.కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లాలోని అనేక ట్రేడ్ యూనియన్లు బుధవారం రాత్రి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం జిల్లాలో లారీలు, ఇతర వాహనాలు రోడ్లపైకి రాకుండా నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్ఎస్, హెచ్ఎమ్ఎస్, లారీ ఓనర్స్ అసోసియేషన్, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్లతోపాటు మరికొన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతు పలుకుతున్నాయి. సమ్మె కారణంగా జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుండడంతో వ్యాపారులు, ప్రజలు రాత్రికి తమ సరుకులను చేర్చుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుంటూరు ఉప రవాణాశాఖ అధికారి కార్యాలయంలో ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.