MP YS Avinash Reddy Video On Viveka Murder Case Has Gone Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా విచారణ

Published Fri, Apr 28 2023 4:53 AM | Last Updated on Fri, Apr 28 2023 2:28 PM

MP YS Avinash Reddys video on Vivekas murder has gone viral on social media - Sakshi

 సాక్షి ప్రతినిధి, కడప: ‘సీబీఐ పెద్ద సంస్థ... నేను ఆ సంస్థ మొత్తాన్ని నిందించే పెద్దవాడిని కాదు గానీ వివేకం పెదనాన్న హత్య కేసులో విచారణ చేస్తున్న రామ్‌సింగ్‌ ఏకపక్షంగా వ్యవహరించారు. ఫ్యాక్ట్‌ టార్గెట్‌ కాకుండా పర్సన్‌ను టార్గెట్‌ చేస్తూ విచారణ చేస్తున్నారు. కట్టుకథల ఆధారంగా అబద్ధాల కట్టడాలను కడుతోంది. మా అక్క సునీతమ్మ తన భర్తను కాపాడుకునే క్రమంలో నన్ను, మానాన్న వ్యక్తిత్వాలను నాశనం చేస్తోంది.

సునీతమ్మను పావుగా వాడుకుని  ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, బీజేపీలో చేరిన టీడీపీ నేతల ద్వారా వైఎస్సార్‌ సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ (ఐవో) ఏకపక్ష వైఖరి, ఎల్లో మీడియా కట్టుకథలపై ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వీడియో గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో వివరాలు ఇవీ.. 

మూడేళ్లుగా మాట్లాడాలనుకున్నా.. 
సీబీఐ విచారణ గురించి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మూడేళ్లుగా చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నా.. సీబీఐపై నమ్మకంతో, వివేకం పెద్దనాన్న గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక, చనిపోయిన వ్యక్తి కు­మార్తె, అల్లుడు గురించి మాట్లాడలేక ఎన్ని ఆరోపణలొచ్చినా మౌనంగానే ఉన్నా. విచారణ తప్పుదారిలో వెళ్తున్నా భరించా. సీబీఐ వేసిన రెండు చార్జిïÙ­ట్లు, 248 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు, కోర్టుల్లో దా­ఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్లు, వ్యక్తిగతంగా నా విచారణను బేస్‌ చేసుకొని నేను మాట్లాడుతున్నా.  

పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం.. 
వాచ్‌మెన్‌ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. నలుగుర్ని గుర్తు పట్టి వారి పేర్లు కూడా చెబుతాడు. మరి నలుగురిలో ఒకర్ని అప్రూవర్‌గా మార్చాల్సిన అవసరం ఉందా? కిరాయికి హత్య చేసిన వ్యక్తి, డబ్బు కోసం మంచి మనిషి ని చంపిన వ్యక్తి, అదే డబ్బు కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడడా? హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్‌కు సీబీఐ నో అబ్జెక్షన్‌ అని చెబుతోంది.

రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్‌ పిటిషన్‌ వేసినా ఇంప్లీడ్‌ అవుతున్న సునీతమ్మ మరి దస్తగిరి ముందస్తు బెయిల్‌ పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అతడిని పావుగా వాడుకొని మమ్మల్ని టార్గెట్‌ చేయడం కాదా? అప్రూవర్‌ అనే అబద్ధాల కట్టడంలో అత్యున్నతస్థాయి విచారణ సంస్థ ఇన్వెస్టిగేషన్‌ అధికారి రామ్‌సింగ్‌ దిగజారి ప్రవర్తించారు. కీలక అంశాలను మరుగున పరుస్తూ సిల్లీ అంశాల ఆధారంగా విచారణ కొనసాగించారు.  

నిజాలను మరుగునపరచి.. 
ఘటనా స్థలంలో ఉన్న వాస్తవాన్ని ఎందుకు దాచి పెట్టాల్సి వ చ్చింది? వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్‌ నోట్‌ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డిని ఎవరికీ చూపించకుండా లేఖ దాచి పెట్టాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వాస్తవాలు చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌లో చెప్పారు.

జమ్మలమడుగు వెళ్తున్న నేను అక్కడికి వెళ్లి చూసిన ఘటనను ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చా. అప్పటి సీఐకి ఫోన్‌ చేసి వివేకం పెద్దనాన్న చనిపోయారు, చాలా రక్తం ఉంది, బెడ్‌ రూమంతా రక్తం ఉంది, త్వరగా రండి సార్‌.. అని చెప్పా. అది హత్య అని తెలియడానికి లెటర్‌ క్లియర్‌ ఎవిడెన్స్‌. లెటర్‌ కంటెంట్‌ విన్న వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కనీసం నాకైనా చెప్పాలి కదా? హత్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఇలాంటి వాస్తవాలను రామ్‌సింగ్‌ మరుగునపరచి ఏకపక్షంగా వ్యవహరిస్తారు. సునీతమ్మ తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కేసు నుంచి కాపాడుకునేందుకు ఆరాటం చూపుతోంది.  

అన్ని వేళ్లు వాళ్ల వైపే... 
ఘటనాస్థలంలో దొరికిన లెటర్‌తో పాటు వేళ్లన్నీ వాళ్ల వైపే చూపుతున్నాయి. వివేకం సార్‌ 2010లో ఇస్లాం మతం స్వీకరించి మహమ్మద్‌ అక్బర్‌గా పేరు మార్చుకొని షమీమ్‌ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి షహెన్‌షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. సునీతమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, షమీమ్‌ స్టేట్‌మెంట్లు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. షమీమ్‌కు ఒక విల్లా కొనుగోలు చేసి ఇచ్చి, అబ్బాయిని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివించాలని, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వారి జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వివేకం పెదనాన్న అనుకున్నారు.

బెంగళూరు డీల్‌ రూ.8 కోట్లు వస్తే ఆ మొత్తం వారికి ఇవ్వాలనుకున్నారు. అయితే బెంగళూరులో డబ్బు వచ్చే అవకాశమే లేదని 8 మంది సాక్షుల ద్వారా వెల్లడైంది. తన వాటా ఆస్తిగా వచ్చిన 25 శాతం భాగాన్ని షమీమ్‌ కుటుంబానికి చెందేలా వివేకం సార్‌ విల్లు రాయించారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఇది తెలిసి ఎర్ర గంగిరెడ్డి ద్వారా పథక రచన చేశారు. రెండో పెళ్లి వ్యవహారంతో 2013 నుంచి సునీతమ్మకు, పెదనాన్నకు మధ్య మాటలు కూడా లేవు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా ఆ విషయాన్ని విచారణలో వెల్లడించారు. వివేకం సార్‌కు ఉన్న చెక్‌ పవర్‌ను కూడా రద్దు చేశారు.

హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి  డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు తీసుకెళ్లినట్లు ఏ–4 చెబుతున్నాడు. ఇవన్నీ కూడా వేళ్లు వారివైపే చూపుతున్నాయి. ఏ–2, ఏ–3 కుటుంబ సభ్యుల కారణంగా వివేకం సార్‌తో తీవ్రమైన విభేదాలున్నాయి. ఎర్రగంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వీరందర్నీ వాడుకున్నారు. ఇది పూర్తిగా మర్డర్‌ ఫర్‌ గెయిన్‌. రాజశేఖరరెడ్డిని తప్పించి దస్తగిరిని పావుగా చేసుకొని మమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారు.  

సునీతమ్మది పోరాటం కాదు...ఆరాటం 
వివేకం సార్‌ హత్య కేసులో సునీతమ్మది పోరాటం కాదు, ఆరాటం మాత్రమే. భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఈ హత్య కేసులోంచి బయటికి రావాలి. అమె భర్త స్థానంలో నన్ను, మా నాన్నను ఇరికించాలి. అది అసూయతోనే. ఇంకో కారణం లేదు. మాకైతే సునీతమ్మపై గౌరవం ఉంది. ఆమెను బాధ పెట్టాలని కాదు.. వాస్తవాలు తెలియాలి కాబట్టి చెబుతున్నాం. సుప్రీంకోర్టులో నాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పిటిషన్‌ వేశారు. రామ్‌సింగ్‌ను సపోర్టు చేస్తూ కౌంటర్‌ పిటిషన్‌ వేస్తారు.

పర్సన్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. మాజిల్లా వాసులందరికీ తెలుసు. ఎంపీ టికెట్‌ మోటివ్‌ అన్నది హాస్యాస్పదం. వైఎస్‌ వివేకా ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలో డోర్‌ టు డోర్‌ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి, ఎంపీగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. సంబంధం లేని వారి జీవితాలను ఇందులోకి లాగి ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? ఈ విషయాన్ని సీబీఐని అడుగుతున్నా. సునీతక్కను కూడా అడుగుతున్నా.

నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వివేకం పెదనాన్న బలపర్చేవారు. నా కార్యక్రమాలకు వచ్చేవారు. నా కోసం ఫైట్‌ చేసే వ్యక్తిని నేను చంపాననడం ఎంతవరకూ లాజికల్‌ అనేది ఆలోచించండి. 2014లో వేంపల్లెలో వీధి వీధిలో తిరుగుతూ మా ఇద్దరు కుమారులు జగన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు.    

అప్రూవర్‌ కట్టుకథ.... 
సీబీఐకి సాక్షుల స్టేట్‌మెంట్లు పరిశీలిస్తే (ఎల్‌డబ్ల్యూ 10, 34, 37, 38, 50, 86, 94, 98) బెంగళూరు సెటిల్‌మెంట్‌ ఫెయిల్‌ అయింది. రాధాకృష్ణమూర్తివి ఫేక్‌ డాక్యుమెంట్లు, డబ్బులు రావని స్పష్టంగా చెప్పారు. ఏమాత్రం డబ్బులు రాని విషయం గురించి వాదోపవాదనలు చేసుకుని చంపినట్లు చెప్పడం కట్టుకథ కాదా? అది స్పష్టంగా తెలియడం లేదా? వివేకం పెదనాన్న హత్యలో సిట్‌ నాలుగైదు కోణాల్లో విచారణ కొనసాగించింది.

వివేకం సార్‌ రెండో వివాహం, బతికున్న సమయంలో బలపనూరులో షమీమ్‌కు కట్టించిన ఇంటిని కూడా రాయించుకోవడం, మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ అన్న విషయం వెలుగు చూస్తున్న సమయంలో.. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కాపాడుకునేందుకు సునీతమ్మ సిట్‌ వద్దు సీబీఐ విచారణ కావాలని కోరుతోంది. అంతకంటే వేరే మతలబు లేదు.  

ఎల్లోబ్యాచ్‌ పావుగా సునీతమ్మ 
సీబీఐ ఎంతో పెద్ద ఏజెన్సీ. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఏ–4 దస్తగిరిని పావుగా చేసుకొని సునీతమ్మ మమ్మల్ని టార్గెట్‌ చేస్తోంది. సునీతమ్మను పావుగా చేసుకొని లబ్ధి పొందేందుకు ఎల్లో బ్యాచ్‌ ప్రయతి్నస్తోంది. వాళ్లకు నేను, మానాన్న టార్గెట్‌ కాదు. వైఎస్సార్‌సీపీనే టార్గెట్‌. ఎందుకంటే మాద్వారా వైఎస్సార్‌సీపీ డీఫేమ్‌ కావాలి.

ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వారికి ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం లేదు. డీఫేమ్‌ చేయడంలో ఎల్లోబ్యాచ్‌ ఎక్స్‌పర్ట్‌. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడినే డీఫేమ్‌ చేసి రోడ్డున పడేశారు. మీ కుట్రలను పటాపంచలు చేస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ వ్యవస్థపైన మాకు నమ్మకం ఉంది. అబద్ధాల కట్టడాలు న్యాయస్థానంలో నిలబడవు. నిజం పునాదిపై ఉన్నాం. చివరకు న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement