
సాక్షి, పల్నాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగానూ పార్టీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానుల కోలాహలం స్పష్టంగా కనిపించింది.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త కొణతం సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నడికుడిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఫాతిమా హాస్పిటల్‌లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బధిర బాలల నడుమ కేక్ కట్ చేయించిన ఆయన.. సీఎం జగన్ చల్లగా ఉండాలని అక్కడున్న వాళ్లంతా కోరుకున్నారు.