
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో గతంలో లాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తిరిగి విధులకు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శుక్రవారమే బాధ్యతలను స్వీకరించా. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు, అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి తెలియజేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగన రాజ్యాంగ వ్యవస్థ. ఇది రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.