
సాక్షి,ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఉన్న ఏనుగుల గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. అయితే తల్లి ఏనుగు మాత్రం కోపంగా వెనక్కి తిరిగి వచ్చింది. దీంతో ఆ యువకులు పరుగులు తీశారు. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..)
Comments
Please login to add a commentAdd a comment