ఒంగోలు టౌన్: ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌ను ప్రారంభించినట్లు హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు తెలిపారు. ప్రకాశం జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ దృష్టిలో సమానమేనని స్పష్టం చేశారు.
ఆర్థి క కారణాలతో న్యాయ పరమైన సేవల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసేందుకే ఈ ప్రక్రియను తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్హులైన వారు ఉచితంగా న్యాయం అందకపోవడం వలన నష్టపోయామని బాధపడకూడదనేదే లీగల్ ఎయిడ్ ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా నియమితులైన జి.రవిశంకర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా నియమితులైన డి.బ్లెస్సీలను అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్.శివకుమార్, డి.అమ్మనరాజా, టి.రాజా వెంకటాద్రి, ఎంఏ సోమశేఖర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment