సీఎం జగన్‌ను కలిసిన పాలిటెక్నిక్‌ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు | Polytechnic Lecturers JAC Representatives Thanked CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన పాలిటెక్నిక్‌ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు

Published Thu, Jul 21 2022 3:46 PM | Last Updated on Thu, Jul 21 2022 3:51 PM

Polytechnic Lecturers JAC Representatives Thanked CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌-2016ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్‌ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు.
చదవండి: బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement