
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని.. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని ధ్వజమెత్తారు.ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌గా అన్నారు.
‘‘భూములు కొన్న తర్వాత ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారు. దానికి సంబంధించినదే 41 జీవో. దీనిలో చంద్రబాబు, నారాయణ పాత్ర కూడా ఉంది. దీనికి సంబంధించి సీఐడీ విచారణ చేస్తున్నారు. చంద్రబాబు తనకున్న అలవాటు ప్రకారం స్టే తెచ్చుకున్నారు. ఆయనకు రాజధాని మీద ప్రేమ లేదు.. వేల ఎకరాలు దోచుకునేందుకే ఇదంతా చేశారు. అక్కడి భూములు దోచుకునేందుకు ఆయన, ఆయన తాబేదార్లు వేసిన ప్లాన్ అమరావతి.
స్టే వచ్చింది.. మా బాబు నిర్దోషి అని జబ్బలు చరుచుకుంటున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడమే తప్పన్నట్లు, ఎవరినో బెదిరించి కేసు పెట్టినట్లు మాపై ఆరోపణలు చేస్తున్నారు. పేదలపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునేందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. జీవో 41 ద్వారా వాళ్ళ వారు లబ్ధి పొందారని మేము ప్రజలకు వివరించదలిచాం. చంద్రబాబు ఆలోచన మంచిదే అయితే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో అసైన్డ్ ల్యాండ్ గురించి ఎందుకు పెట్టలేదు..?. దళితుల నుంచి ఆయన అనుచరులు, బినామీలు కొన్నాక 2016లో యాక్ట్ ఎందుకు మార్చారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
చదవండి:
‘త్వరలోనే చంద్రబాబు మరో బాగోతం..’
Comments
Please login to add a commentAdd a comment