ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. | SHAR To Launch SSLV Second Developmental Flight On February 10 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. వివరాలు ఇవే..

Published Thu, Feb 9 2023 8:08 AM | Last Updated on Thu, Feb 9 2023 8:08 AM

SHAR To Launch SSLV Second Developmental Flight On February 10 - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 10న ఉదయం 9.18 గంటలకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు. 

ఈ ప్రయోగానికి సంబంధించి ఈ నెల 9న లాంచ్‌ రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్‌ఆర్‌ సమావేశం అనంతరం ప్రయోగపనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు వారికి అప్పగిస్తారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌–01, ఆజాదీశాట్‌–02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement