సాక్షి, తిరుపతి: ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో తొలి రోజు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. బహిరంగ సభలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. నేడు రెండో రోజు గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో యాత్ర జరగనుంది.
తిరుపతిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సు యాత్ర ప్రారంభమైంది. బాలాజి కాలనీ సర్కిల్ పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం టౌన్ క్లబ్ మీదుగా జ్యోతి టాకీస్ రోడ్, రుయా హాస్పిటల్, భవాని నగర్ మీదుగా నగరంలో అన్ని డివిజన్లు కలుపుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతోంది.
సాయంత్రం 4 గంటలకు గ్రూప్ థియేటర్స్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు వివరించనున్నారు. గజపతినగరంలో మధ్యాహ్నాం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్‌బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం పట్టణం చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.
చదవండి: వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment