ప్రతీ ఇంటికి 15 లక్షల ఆస్తి | Vijaya Sai Reddy Comments On YSR Housing Scheme | Sakshi
Sakshi News home page

ప్రతీ ఇంటికి 15 లక్షల ఆస్తి సొంతం

Published Thu, Dec 31 2020 10:18 AM | Last Updated on Thu, Dec 31 2020 10:34 AM

Vijaya Sai Reddy Comments On YSR Housing Scheme - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లో పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది. శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుంది. ( ఇన్నాళ్లకు కల తీరింది..)

పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుంది’’ అని పేర్కొన్నారు. అంతకు క్రితం మరో ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వం కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదం తెలపడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement