జనం మెచ్చిన 'జగన్‌' | Warm welcome in every village for Why AP Needs Jagan | Sakshi
Sakshi News home page

జనం మెచ్చిన 'జగన్‌'

Published Mon, Nov 27 2023 4:06 AM | Last Updated on Mon, Nov 27 2023 4:07 AM

Warm welcome in every village for Why AP Needs Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి గ్రామంలోనూ ఘన స్వాగతాలు.. అపూర్వ ఆదరణ నడుమ జనమంతా మెచ్చిన కార్యక్రమం ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే..’ (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) ఘన నీరాజ­నాలు అందుకుంటోంది. ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా వివక్షకు తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పారదర్శకంగా అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రమంతటా ప్రజలు బాసటగా నిలు­స్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాలుగు­న్నరేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ తెలియచేస్తూ చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 18,12,831 కుటుంబాలు భాగస్వాములయ్యాయి. ఈ నెల 9వ తేదీన ఈ కార్యక్రమం ఘనంగా ఆరంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల కస్టర్లు ఉండగా ఇప్పటిదాకా 54,779 క్లస్టర్ల పరిధిలో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతోంది. 

సచివాలయాల వద్ద ‘సంక్షేమ – అభివృద్ధి బోర్డులు’
గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఒక్కో సచివాలయం పరిధిలో గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఎంత మంది లబ్ధిదారులకు ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం ప్రయోజనం చేకూర్చిందనే వివరాలతో ఆయా సచివాలయాల వద్ద ‘సంక్షేమ – అభివృద్ధి బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో రోజూ మండలానికి ఒక సచివాలయ పరిధిలో సందడిగా బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది.

సంక్షేమ బోర్డును ఆవిష్కరించిన మరుసటి రోజు నుంచి ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శిస్తూ ప్రభుత్వ కార్యక్ర­మా­లను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నారు.

7,170 సచివాలయాల్లో బోర్డుల ఆవిష్కరణ
ఈ నెల 9వ తేదీన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఆదివారం వరకు 7,170 సచివాలయాల పరిధిలో సంక్షేమం – అభివృద్ధి వివరా­లతో కూడిన బోర్డుల ఆవిష్కరణ పూర్తి అయినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సంక్షేమ బోర్డుల ఆవిష్కరణ జరిగిన సచివాలయాల పరిధిలో 34.91 లక్షల కుటుంబాలు ఉండగా దాదాపు 18,12,831 కుటుంబాల ఇంటి సందర్శన కార్య­క్రమాన్ని పూర్తి చేశారు.

నాలుగున్నరేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూర్చిందనే వివరాలను వివరిస్తున్నారు. గతంలో పోలిస్తే నాలుగున్నరేళ్లలో గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను తెలియచేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement