మత్స్యకారుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

Published Wed, Jan 29 2025 1:37 AM | Last Updated on Wed, Jan 29 2025 1:37 AM

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

గాలివీడు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన తన సోదరుడు టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డితో కలిసి మంగళవారం మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో మండలంలోని వెలుగల్లు ప్రాజెక్టులో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, బోట్లు, ఐస్‌ బాక్సులు, మోటార్‌ సైకిల్‌ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందన్నారు. గాలివీడు మండలంలో దాదాపు 300 కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి ఉన్నాయని, వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రాబోయే మూడు సంవత్సరాలలో వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా నీరు సరఫరా చేసి నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 300 బోర్లు, మోటార్లు బిగించి గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ డీడీ సుస్మిత, తహసీల్దార్‌ భాగ్యలత, ఎంపీడీఓ జవహర్‌ బాబు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

చిన్నమండెం: మండల పరిధిలోని నాగిరెడ్డిగారిపల్లెలో రూ.32 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్‌ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి నాగిరెడ్డిపల్లెలో నీటి సమస్య పరిష్కారానికి నూతన బోరును ప్రారంభించారు. అంతకు మునుపు మంత్రి స్వగ్రామమైన బోరెడ్డిగారిపల్లెలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement