కలకడ కేంద్రంగా ఐటీసీ కొనుగోళ్లు
కలకడ: కలకడ కేంద్రంగా టమాట, మామిడి పంటలను కొనుగోలు చేసి.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయడానికి రైతుల భాగస్వామ్యంతో ఐటీసీ సంస్థ ముందుకు వచ్చిందని జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు తెలిపారు. కలకడలో అధికారులు, రైతులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ట్రెండ్స్ ఎన్జీఓ (ఐటీసీ అనుబంధ సంస్థ) ఎఫ్పీఓలుగా, రైతులు కమిటీలో డైరెక్టర్లుగా ఉంటారని పేర్కొన్నారు. తద్వారా వ్యాపార లావాదేవీలతోపాటు, పంట దిగుబడికి సలహాలు సూచనలు, మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. పడమట మండలాలలో అధికంగా టమాట పంట సాగు చేసే రైతులు కెవిపల్లె, కలకడ, గుర్రంకొండ, మదనపల్లె మండలాల్లో ఉండటంతో కలకడను కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి సుకుమార్‌రెడ్డి, ఐటీసీ ప్రతినిధి భోజరాజు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment