ఏపీఎస్ఎఫ్ఎల్ అంతరాయాన్ని పరిష్కరించాలి
రాయచోటి టౌన్: రాష్ట్రంలోని ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ( ఫైబర్) అంతరాయం కలిగిస్తోందని, దీనిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ప్రజలకు నిరంతరాయంగా నెట్ కనెక్షన్‌తోపాటు టీవీ, టెలిఫోన్ సౌకర్యం ఉందన్నారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఫైబర్ నెట్ వారికి, ఏపీ ట్రాన్స్‌కో వారికి మధ్య సమన్వయ లోపంతో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment