
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వేటపాలెం: బాపట్ల జిల్లాలో సముద్రపు తాబేళ్ల (ఆలీవ్ రిడ్లే) సంరక్షణలో అటవీ శాఖ ముందుంది. జిల్లాలో చిన్నగంజాం మండలం ఏటిమొగ్గ నుంచి బాపట్ల మండలం సూర్యలంక వరకు 55 కిలో మీటర్లు సముద్ర తీరం వెంట సముద్ర తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో ఆరు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి పిల్లలుగా తయారైన తరువాత వాటిని సముద్రంలోకి విడిచి పెడుతుంటారు. వీటి సంరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 12 మంది వలంటీర్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. వీటిపై పర్యవేక్షణకు కోఆర్డినేటర్‌ను నియమించారు.
తాబేళ్ల సంరక్షణ ఇలా...
ఆలీవ్ రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాదీ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు మాత్రమే ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. సముద్రం నుంచి అర్థరాత్రి వేళల్లో తాబేళ్లు ఒడ్డుకు చేరుకొని తీరానికి దగ్గరలో ఇసుకలో గుంటలు ఏర్పాటుకొని గుడ్లు పెడుతుంటాయి. ఒక్కొక్క తల్లి తాబేలు 100 నుంచి 160 గుడ్ల వరకు పెడుతుంటుంది. వేకువజామునే అటవీ శాఖ ఏర్పాటుచేసిన వలంటీర్లు తీరం వెంట వెళ్లి తల్లి తాబేళ్ల కాళ్ల అనవాళ్లను గుర్తించి అవి ఎక్కడ గుడ్లు పెట్టింది కనుగొంటారు. తల్లి తాబేళ్లు పెట్టిన గుంటను జాగ్రత్తగా తవ్వి గుడ్లను సేకరించుకొని వెళ్లి సంరక్షణ కేంద్రంలో గుంటలు ఏరా్పాటు చేసి అక్కడ పెడతారు. సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గుంతల్లో నుంచి గుడ్లు పిల్లగా మార్పు కావడానికి 33 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలి. ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటకుండా చూసే బాధ్యత వలంటీర్లపై ఉంటుంది. ఆ గుడ్లు 48 నుంచి 55 రోజుల్లో పిల్లలుగా మార్పు చెందుతాయి. ఈ పిల్లలను తిరిగి వలంటీర్ల ద్వారా సురక్షితంగా సముద్రంలో వదిలిపెడతారు.
తాబేళ్లు పిల్లలను సముద్రంలోకి వదులుతున్న అటవీ అధికారులు
సంరక్షణ తల్లి పెట్టిన వదిలిన
కేంద్రం తాబేళ్లు గుడ్లు పిల్లలు
ఏటిమొగ్గ 36 4063 764
కుంకుడుచెట్లపాలెం16 1687 611
రామచంద్రాపురం26 2944 339
పొట్టి సుబ్బయ్యపాలెం26 2896 227
రామాపురం 17 1929 211
సూర్యలంక 24 2651 206
న్యూస్‌రీల్
వేల సంఖ్యలో సంరక్షించాం
తాబేళ్ల సంరక్షణ కేంద్రాల వద్ద తొమ్మిదేళ్లుగా వలంటీర్‌గా పనిచేస్తున్నాను. వేల సంఖ్యలో తాబేళ్ల పిల్లలను సంరక్షించి సముద్రంలోకి వదిలి పెట్టాం. వేకువజామునే సముద్రం ఒడ్డునే తల్లి తాబేళ్లు పెట్టిన గుడ్లు సేకరించడానికి వెళతాం. వాటి కాలి అడుగు జాడలను బట్టి అవి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తాం.
– కే అర్జునరావు, వలంటీర్
తాబేళ్ల సంరక్షణకు
12 మంది వలంటీర్లు
ఈ ఏడాది ఇప్పటి వరకు 145 తల్లి తాబేళ్ల నుంచి 16,170 గుడ్లు సేకరణ
సురక్షితంగా 2,358 ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి విడుదల
ఇప్పటి వరకు తల్లి తాబేళ్లు పెట్టిన గుడ్లు, సముద్రంలోకి వదిలిన పిల్లలు వివరాలు...

శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025