మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్‌నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్‌నాయక్‌

Published Tue, Apr 8 2025 10:52 AM | Last Updated on Tue, Apr 8 2025 10:52 AM

మత్స్

మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్‌నాయక్‌

బాపట్ల: బాపట్ల మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా ఓ. శ్రీనివాస్‌నాయక్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి ఉపసంచాలకులుగా పని చేస్తూ పదోన్నతిపై బాపట్లకు వచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళిని, జేసీ ప్రఖర్‌జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మత్స్యకారులకు అందుబాటులో ఉంటానన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఇంటర్‌ అడ్మిషన్లు చేపట్టండి

డీఐఈఓ నీలావతిదేవి

నరసరావుపేట ఈస్ట్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. ఈమేరకు ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు తెలియచేసినట్టు వివరించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గురుకుల కళాశాలలతోపాటు మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, గిరిజన సంక్షేమ కళాశాలలు తదితర ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ప్రవేశాలను పెంచేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలను విద్యార్థుల దృష్టికి తీసుకవెళ్లాలన్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టినట్టు వివరించారు. కాగా, ఇంటర్‌ ఫలితాలను రెండవ వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తుందని తెలిపారు.

ముప్పాళ్లలో భారీ వర్షం

ముప్పాళ్ళ: ముప్పాళ్లలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమవడంతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడితో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలులతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప, పసుపు పంట దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు పట్టలు కప్పేందుకు పరుగులు పెట్టారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, తడిస్తే కొనేవారు ఉండరని రైతులు ఆందోళన చెందుతున్నారు.

గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ

పట్నంబజారు: గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్‌ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు.

1,53,787 బస్తాలు మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్‌నాయక్‌ 1
1/1

మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement