
బాపట్ల విద్యార్థుల హవా
బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో మొత్తం 9146 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 5907 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఉత్తీర్ణతలో జిల్లా 65 శాతం సాధించింది. సీనియర్ ఇంటర్‌లో జిల్లాలో మొత్తం 7420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 5837 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో జిల్లా 79 శాతం సాధించింది.
ప్రభుత్వ కళాశాలల్లో
ఉత్తమ ఫలితాలు
జిల్లాలో మొత్తం 17 ప్రభుత్వ కళాశాలలు ఉండగా ఫలితాల్లో ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాపట్ల డెప్ అండ్ డెమ్ జూనియర్ కళాశాల, నూతలపాడు జూనియర్ కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. 73.33 శాతం సాధించి బల్లికురవ ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది.
● సీనియర్ ఇంటర్‌లో బాపట్ల డెఫ్ అండ్ డెమ్ జూనియర్ కళాశాల, బల్లికురవ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచాయి. చందోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల 79.71 శాతం సాధించి ద్వితీయస్థానంలో నిలిచింది.
బాలికలదేపై చేయి
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించే వారిలో విద్యార్థినులే పైచేయి సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పర్చూరుకు చెందిన షేక్ సమీరా 1000 మార్కులకుగానూ 975 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది.
● బైపీసీలో చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన కె.ధాత్రిశ్రీ 1000 మార్కులకుగానూ 975 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది.
సీనియర్ ఇంటర్‌లో 79 శాతం ఉత్తీర్ణత జూనియర్ ఇంటర్‌లో 65 శాతం ఉత్తీర్ణత సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 975 మార్కులతో ప్రథమస్థానం సీనియర్ ఇంటర్ బైపీసీలో 975 మార్కులతో ప్రధమస్థానం

బాపట్ల విద్యార్థుల హవా

బాపట్ల విద్యార్థుల హవా