
రుణాల రికవరీలో చినగంజాం ప్రథమ స్థానం
చినగంజాం: 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి నూరు శాతం రికవరీ చేపట్టిన డీఆర్‌డీఏ చినగంజాం శాఖకు జిల్లాలో ప్రథమ స్థానం దక్కినట్లు ఏపీఎం జీ పెద సుబ్బారావు తెలిపారు. శుక్రవారం బాపట్లలో డీఆర్‌డీఏ పీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో చినగంజాం శాఖకు ప్రశంసా పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో రూ.7 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.9.56 కోట్లు లక్ష్యాన్ని పూర్తిచేసి నూరు శాతం రికవరీలు సాధించినందుకు తమకు జిల్లాలో ప్రథమంగా గుర్తించి ప్రశంసాపత్రం అందజేసినట్లు ఆయన వివరించారు. జిల్లా ప్రథమంగా చినగంజాం శాఖ గుర్తింపు పొందడం పట్ల ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మణాచారి, శ్రీనిధి మేనేజర్ కరుణాకర్‌లు చినగంజాం టీంని అభినందించినట్లు తెలిపారు.